న్యూఢిల్లీ : భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ్ మేదినీపూర్ సల్బోనీలో ఉక్కు ఫ్యాక్టరీని ప్రారంభించడం ద్వారా పారిశ్రామికవేత్తగా మారుతున్నారు. స్పెయిన్, దుబాయ్ పర్యటన కోసం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కలిసి వచ్చిన ప్రతినిధి బృందంలో ఉన్న గంగూలీ, ఐదు నుంచి ఆరు నెలల్లో ఫ్యాక్టరీని పూర్తి చేస్తామని చెప్పారు.
Also Raed: కొడతారా కప్పు! .. శ్రీలంకతో ఇండియా అమీతుమీ
‘‘బెంగాల్‌లో మూడో ఉక్కు ఫ్యాక్టరీని నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నందున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నేను కేవలం ఆటలు మాత్రమే ఆడానని చాలా మంది నమ్ముతున్నారు. కానీ మేం 2007లోనే చిన్న ఉక్కు కర్మాగారాన్ని ప్రారంభించాం. ఆరు నెలల్లో మేదినీపూర్‌లో మా కొత్త స్టీల్ ప్లాంట్‌ను నిర్మించడం మొదలుపెడతాం" అని గంగూలీ చెప్పారు. మాడ్రిడ్‌లో గురువారం జరిగిన 'బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ (బీజీబీఎస్)'లో గంగూలీ ప్రసంగిస్తూ ఈ విషయాన్ని తెలిపారు. 50 సంవత్సరాల క్రితం తన తాత ప్రారంభించిన తన కుటుంబ వ్యాపారానికి ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మద్దతుగా ఉందని బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ కూడా అయిన గంగూలీ చెప్పారు.