మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత 2016 లో మూడు ఫార్మాట్ లకు విరాట్ కోహ్లీ భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాధ్యతలు చేపట్టాడు. ఈ క్రమంలో ఎన్నో విజయాలను భారత్ కు అందించిన విరాట్.. భారత అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు. అగ్రెస్సివ్ కెప్టెన్ గా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న కోహ్లీ 2021లో టీ20 వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత వన్డేలకు కోహ్లీ నుంచి కోహ్లీని తొలగించగా.. 2021-22 దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత కోహ్లీ టెస్టు కెప్టెన్ కు రాజీనామా చేసాడు.
కోహ్లీ టెస్టులకు రాజీనామా చేయడంతో రోహిత్ మూడు ఫార్మాట్ లలో టీమిండియాను నడిపిస్తున్నాడు. అప్పట్లో సౌరవ్ గంగూలీ భారత అధ్యక్ష పదవిలో ఉండడంతో ఈ మాజీ కెప్టెన్ కావాలనే కోహ్లీని పక్కన పెట్టాడనే ప్రచారం విపరీతంగా జరిగింది. అయితే కోహ్లి టెస్టు కెప్టెన్సీకి రాజీనామా చేయడంలో తన ప్రమేయం ఏమీ లేదని గంగూలీ మరోసారి చెప్పుకొచ్చాడు. తాను కోహ్లీని టెస్టు కెప్టెన్సీ నుంచి తొలగించలేదని.. టీ20ల నుంచి వైదొలిగిన తర్వాత వన్డేలకు కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని తాను కోరుకున్నానని గంగూలీ చెప్పాడు.
రియాల్టీ షో దాదాగిరి అన్‌లిమిటెడ్ సీజన్ 10లో పాల్గొన్న గంగూలీ ఈ సందర్భంగా కోహ్లీ కెప్టెన్సీ రాజీనామాపై వివరణ ఇచ్చాడు."నేను విరాట్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించలేదు. ఈ విషయాన్ని నేను చాలాసార్లు చెప్పాను. అతను T20I లకు కెప్టెన్సీ చేయడానికి ఆసక్తి చూపలేదు. కోహ్లీ ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత, నేను కోహ్లీతో మాట్లాడాను. నీకు T20I లలో కెప్టెన్సీ చేయడం ఇష్టం లేకపోతే మొత్తం వైట్ బాల్ క్రికెట్ నుండి వైదొలగడం మంచిది. వైట్ బాల్ క్రికెట్ కు ఒక ప్లేయర్, రెడ్ బాల్ క్రికెట్ కు ఒక ప్లేయర్ ఉండడం ఉత్తమం. అని కోహ్లీకి చెప్పానని ఈ మాజీ భారత కెప్టెన్ చెప్పుకొచ్చాడు.
2014 లో ధోనీ రిటైర్మెంట్ తర్వాత భారత టెస్టు కెప్టెన్ గా కోహ్లీ ఎంపికయ్యాడు. 7 ఏళ్లలో 68 టెస్టులకి కెప్టెన్సీ చేసిన కోహ్లీ భారత్ కు 40 విజయాలను అందించాడు. మరో 17 టెస్టుల్లో ఓడిపోయింది. భారత్ కు ఎక్కువ టెస్టు విజయాలు అందించిన రికార్డ్ విరాట్ పేరిట ఉండగా.. ఓవరాల్ గా నాలుగో స్థానంలో నిలిచాడు. గ్రేమ్ స్మిత్(53), రికీ పాంటింగ్(48), స్టీవ్ వా(41) తొలి మూడు స్థానాల్లో నిలిచారు.
Sourav Ganguly, ex-BCCI president, sheds light on Virat Kohli's captaincy saga. pic.twitter.com/fiDeEVYmoi
— CricTracker (@Cricketracker) December 5, 2023