
దుబాయ్: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా మరోసారి అపాయింట్ అయ్యాడు. వీవీఎస్ లక్ష్మణ్‌కు మళ్లీ ప్యానెల్ మెంబర్‌గా చోటు దక్కింది. ఈ మేరకు గవర్నింగ్ బాడీ ఈ రెండు నియామకాలకు ఆదివారం ఆమోద ముద్ర వేసింది. మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే స్థానంలో 2021లో దాదా తొలిసారి చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టాడు.
అప్పట్నించి ఈ పదవిలో కొనసాగుతున్నాడు. గంగూలీ, లక్ష్మణ్‌తో పాటు హమిద్ హసన్ (అఫ్గానిస్తాన్), డెస్మండ్ హేన్స్ (వెస్టిండీస్), టెంబా బావుమా (సౌతాఫ్రికా), జొనాథన్ ట్రాట్ (ఇంగ్లండ్) ఇందులో మిగతా సభ్యులు. న్యూజిలాండ్ మాజీ ఆఫ్ స్పిన్నర్ కేథరిన్ క్యాంప్‌బెల్ ఆధ్వర్యంలో విమెన్స్ క్రికెట్ కమిటీని ప్రకటించారు. అవ్రిల్ ఫాహే (ఆస్ట్రేలియా), ఫోలేట్సి మోసేకి (సౌతాఫ్రికా) ఇందులో మెంబర్స్‌గా ఉన్నారు.