రిషభ్ పంత్.. ఈ క్రికెటర్ పేరు వినపడిన ప్రతిసారి భారత క్రికెట్ అభిమానుల మనసులో ఒకరకమైన బాధ. ఇంకెప్పుడు పంత్‌ను జట్టులో చూస్తామా! అని. ఇకపై ఆ బాధ అక్కర్లేదు. చిచ్చర పిడుగు వచ్చేస్తున్నాడు. వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్(2024) నాటికి పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరతాడని భారత మాజీ దిగ్గజం, ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ సౌరభ్ గంగూలీ తెలిపారు.
పంత్ ఆరోగ్యంపై స్పందించిన గంగూలీ.. ఐపీఎల్ 17వ సీజన్‌లో అతను అలరించేందుకు సిద్ధమవుతున్నాడని తెలిపారు. "పంత్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. వచ్చే సీజన్‌లో ఆడతాడు. అతను నవంబర్ 11 వరకు కోల్‌కతాలో ఉన్నాడు. ఆ సమయంలో రాబోయే వేలంపాటలను దృష్టిలో ఉంచుకుని జట్టు ఎంపిక గురించి చర్చించాం. ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా పంత్ ఉండాలని అందరూ భావిస్తున్నారు.." అని గంగూలీ వెల్లడించారు.
BREAKING :
— Cric Point (@RealCricPoint) November 9, 2023
Sourav Ganguly confirms Rishabh Pant is set to play IPL 2024.
PANT IS BACK!!!!!!#IPL2024 pic.twitter.com/5G83tBXJ5T
కాగా, ఏడాది క్రితం పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి తన స్వస్థలం రూర్కీకి వెళ్తున్న క్రమంలో అతను ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొని మంటల్లో కాలిబూడిదైంది. ఆ సమయంలోఅతను ఒంటరిగా ప్రయాణిస్తున్నారు. నిద్రమత్తులోకి జారుకోవడంతో ఆ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ ఘటనలో తీవ్రంగా గాయపడిన పంత్.. జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం గాయాల నుంచి కోలుకున్న అతను పూర్తి ఫిట్‌నెస్ సాధించి, తిరిగి జట్టులోకి వచ్చేందుకు ఎంతో శ్రమిస్తున్నారు.
Rishabh Pant in a long chat with director of cricket Sourav Ganguly. Looks like the DC management has narrowed down on a few new faces for the #IPL2024 auction. #RishabhPant pic.twitter.com/AqpqsiotrP
— Srinjoy Sanyal (@srinjoysanyal07) November 10, 2023
కాగా, గత సీజన్‌లో పంత్ గైర్హాజరీతో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ వ్యవహరించాడు. ఐపీఎల్ 16వ సీజన్‌లో ఢిల్లీ 14 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 9 పజయాలతో తొమ్మిదో స్థానంలో నిలిచింది.