బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఫోన్ దొంగిలించబడింది. ఈ మేరకు ఆయన కోల్ కత్తాలోని ఠాకూర్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఫోన్ విలువ సుమారు 1.6 లక్షలు విలువ ఉంటుందని తెలిపాడు. ఇందులో వ్యక్తిగత సమాచారం ఉందని, ఫోన్ నెంబర్ కు ఖాతాలకు యాక్సెస్ ఉందని తెలిపాడు. ఫోన్ ఎలాంటి దుర్వినియోగం కాకుండా చర్యలు పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.
గంగూలీ తన ఇంటి నుండి మొబైల్ ఫోన్ మాయమైనట్లు వెల్లడించాడు. ఉదయం 11:30 గంటలకు తన ఫోన్ ను చివరిసారిగా చూసినట్లుగా ఫిర్యాదులో తెలిపాడు. ఆ తరువాత ఎంత వెతికినా కనిపించలేదని.. ఫోన్‌ను గుర్తించి, దానిలోని సమాచారం బయటకు రాకుండా చూసుకోవాలని గంగూలీ పోలీసులను కోరారు. ఫోన్ దొంగిలించబడిన సమయంలో తన ఇంట్లో పెయింటింగ్ పనులు జరుగుతున్నాయని గంగూలీ తెలిపాడు, త్వరలో పోలీసులు పెయింటింగ్ వర్కర్లను ప్రశ్నించే అవకాశం ఉంది.
Sourav Ganguly's phone was reportedly stolen from his residence in Behala, Kolkata. The incident came to light when Ganguly filed a complaint at the Thakurpukur police station on Saturday, 11 February. In his communication, he expressed concern that the phone contained personal… pic.twitter.com/4yfcNUy26P
— IndiaToday (@IndiaToday) February 10, 2024