మంత్రివర్గంలోకి గంగుల కమలాకర్!

మంత్రివర్గంలోకి గంగుల కమలాకర్!

రాష్ట్ర మంత్రివర్గాన్ని ఇవాళ విస్తరించనున్నారు సీఎం కేసీఆర్. కొత్తగా నలుగురికి లేదా.. ఆరుగురికి చాన్స్ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డిలకు కేబినెట్ లో చోటు ఖాయమని వినిపిస్తోంది.

గంగులకు బెర్త్ కన్ ఫామ్

కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు మంత్రివర్గంలో చోటు కన్ఫామ్ అయినట్టు తెలిసింది. అర్ధరాత్రి సీఎంఓ నుంచి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు ఫోన్ వెళ్లిందని.. ఆయన సన్నిహితులు చెప్పారు. కేబినెట్ విస్తరణలో చోటు దక్కుతుందని.. ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం … గంగుల కమలాకర్ కు సూచించినట్టు సమాచారం. ఆదివారం హైదరాబాద్ లో అందుబాటులో ఉండాలని కేసీఆర్.. గంగును ఆదేశించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

కరీంనగర్ జిల్లానుంచి బీసీ నాయకుడు ఈటల రాజేందర్ మంత్రిగా కేబినెట్ లో ఉన్నారు. ఇదే జిల్లాకు చెందిన బీసీ నేత గంగుల కమలాకర్ కు మంత్రివర్గంలో బెర్తు ఖరారు కావడంతో.. ఈటల మంత్రిపదవిపై ఊహాగానాలు పెరిగాయి