కారుకే సెటిలర్ల ఓట్లు.. టీడీపీకి దక్కని డిపాజిట్లు 

కారుకే సెటిలర్ల ఓట్లు.. టీడీపీకి దక్కని డిపాజిట్లు 

హైదరాబాద్ ,వెలుగు: గ్రేటర్ ఎన్నికల్లో వరుసగా రెండోసారి కూడా సెటిలర్స్ అధికార టీఆర్ఎస్ పార్టీకే ఓటేశారు. కూకట్ పల్లి, శేరిలింగంపల్లి,  పటాన్ చెరువు, కుత్బుల్లాపూర్ సెగ్మెంటల్లో మొత్తం 29 డివిజన్లు ఉండగా,  గచ్చిబౌలి , మూసాపేట లో మాత్రమే బీజేపీ విజయం సాధించింది. మిగతా డివిజన్లను టీఆర్​ఎస్​ గెలుచుకుంది.  ఏపీ స‌హా ఇత‌ర రాష్ట్రాల ఓటర్లు  ఈ డివిజన్లలో ఉంటారు. అయితే గత  ఎన్నికల్లో సెటిలర్స్ గంపగుత్తగా టీఆర్ ఎస్​కు ఓటేయగా ఈ సారి  కూడా టీఆర్ ఎస్ వెంటే నడిచారు.  హైదరాబాద్‌లో స్థిరపడ్డ వారంతా తెలంగాణ ప్రజలే అని సెటిలర్లను నమ్మించడంలో టీఆర్‌ఎస్‌ సక్సెస్ అయ్యింది. 2016 లో టీడీపీ కూకట్ పల్లి డివిజన్ లో మాత్రమే ఒక్క సీటు గెలిచింది. ఈసారి ఒక్క సీటు కూడా గెలవలేదు. కనీసం డిపాజిట్లు రాలేదు. సెటిలర్స్ డివిజన్లలో ఓట్లు కూడా చాలా తక్కువగా వచ్చాయి.