రామగుండం బల్దియాకు ఆదాయ వనరులు పెంచాలి : ముజమ్మిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

గోదావరిఖని, వెలుగు: రామగుండం బల్దియాకు ఆదాయ వనరులను పెంపొందించే చర్యలు చేపట్టాలని కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముజమ్మిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంబంధిత డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ల ఆఫీసర్లకు సూచించారు. సోమవారం కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనితీరుపై రివ్యూ చేశారు. రామగుండం కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శానిటేషన్‌‌‌‌‌‌‌‌కు ప్రాధాన్యమివ్వాలన్నారు.

ఆటోలు, ట్రాక్టర్లను వినియోగిస్తూ ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించాలన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కొత్త డంప్ సైట్ ఎంపిక చేసి, అక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలన్నారు. బల్దియాలో 100 శాతం ప్రాపర్టీ ట్యాక్స్, నల్లా ట్యాక్స్ వసూలు చేయాలని, నల్లా కనెక్షన్లు వాటి బిల్లులు రెగ్యులర్ గా వసూలు చేయాలన్నారు. మున్సిపల్ కమిషనర్ నాగేశ్వర్ రావు, తహసీల్దార్ కుమార స్వామి, అధికారులు పాల్గొన్నారు.