టీ20 క్రికెట్ మ్యాచ్ అంటే మినిమమ్ ఎంటర్ టైన్ మెంట్ గ్యారంటీ. 20 ఓవర్ల ఆటలో ఫోర్లు, సిక్సర్లతో అభిమానులను ఖుషీ చేయడానికి సిద్ధంగా ఉంటారు. అయితే బౌలర్లు విజృంభించడం వల్ల.. పిచ్ స్లో గా ఉండడం కారణంగా చిన్నగా ఆడుతూ టెస్ట్ మ్యాచ్ ను వన్డేలా మారుస్తారు. అయితే టీ20 వరల్డ్ కప్ లో భాగంగా దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ ఏకంగా టెస్ట్ క్రికెట్ ను గుర్తు చేసింది.
న్యూయార్క్‌లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట శ్రీలంక.. ఆ తర్వాత దక్షిణాఫ్రికా జిడ్డు బ్యాటింగ్ తో అభిమానుల సహనాన్ని పరీక్షించారు. ఇరు జట్లలో ఏ ఒక్క బ్యాటర్ కు 100 కు పైగా స్ట్రైక్ రేట్ లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇరు జట్ల రన్ రేట్ 5 కూడా లేకపోవడం విశేషం. పిచ్ నెమ్మదిగా ఉండడంతో బౌలర్లు చెలరేగారు. ఈ మ్యాచ్ మొత్తం లో ఏకంగా 127 డాట్ బాల్స్ నమోదయ్యాయి. దీంతో టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఒక మ్యాచ్ లో అత్యధిక డాట్ బాల్స్ నమోదైన మ్యాచ్ గా సరికొత్త రికార్డ్ సృష్టించింది.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే చిన్న టార్గెట్ ఛేజింగ్‌లో సౌతాఫ్రికా సైతం తడబడింది. ఆ టీమ్ ఇన్నింగ్స్ సైతం చప్పగా సాగింది. లంక కూడా మెరుగ్గానే బౌలింగ్ చేసినా టార్గెట్ మరీ చిన్నది కావడంతో ఓటమి తప్పించుకోలేకపోయింది. 78 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేయడానికి 16.2 ఓవర్లు అవసరమయ్యాయి. అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 19.1 ఓవర్లలో 77 రన్స్‌కు ఆలౌటైంది.
🚨 RECORD ALERT 🚨
— KING BABAR AZAM FAN (@MS557866) June 4, 2024
The game between South Africa and Sri Lanka have seen most no. of dot balls (127) ever bowled in a T20 WC game 😲 pic.twitter.com/Bc5C8Ud4pC