వరల్డ్ కప్ తర్వాత దక్షిణాఫ్రికా తమ తొలి సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. స్వదేశంలో భారత్ తో మూడు వన్డేలు, మూడు T20లతో పాటు రెండు టెస్ట్‌లను ఆడాల్సి ఉంది. డిసెంబర్ 10 నుంచి ఈ టూర్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ సిరీస్ కు భారత జట్టును ప్రకటించగా.. తాజాగా మూడు ఫార్మాట్ లకు దక్షిణాఫ్రికా జట్టును ఎంపిక చేశారు.
టెస్టులకు బవుమాకు కెప్టెన్ గా ఉంటాడు. వన్డే, టీ20లకు మార్కరం నాయకత్వం వహిస్తాడు.టెస్టు, వన్డేలకు 15 మంది సభ్యులను ప్రకటించిన దక్షిణాఫ్రికా క్రికెట్.. టీ20ల కోసం 16 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. డిసెంబరు 26నుంచి ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్‌పై దృష్టి సారించేందుకు సీనియర్ ఆటగాళ్లు టెంబా బావుమా, కగిసో రబాడలకు పరిమిత ఓవర్ల నుంచి రెస్ట్ ఇచ్చారు.
అన్రిచ్ నార్ట్జే, వేన్ పార్నెల్ గాయాలతో కోలుకొని కారణంగా ఈ సిరీస్ కు సెలక్టర్లు వీరిని ఎంపిక చేయలేదు. నోర్ట్జ్ వెన్ను గాయంతో బాధపడుతుండగా, పార్నెల్ భుజం గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. సెప్టెంబరులో ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో గాయం కారణంగా భారత్ వేదికగా జరిగిన 2023 ODI ప్రపంచ కప్ జట్టుకు దూరమయ్యారు.
జెరాల్డ్ కోయెట్జీ, మార్కో జాన్సెన్, లుంగి ఎన్‌గిడిలతో కూడిన పేస్ అటాక్ భారత్ తో జరగబోయే మూడో T20Iకి అందుబాటులో ఉండరని తెలియజేసింది. కీలకమైన టెస్ట్ సిరీస్ ఉండడంతో డిసెంబరు 14 నుంచి 17 వరకు జరిగే దేశవాళీ క్రికెట్‌ను ఆడనున్నారు. ఇక పేసర్ నాండ్రే బర్గర్, బ్యాటర్లు డేవిడ్ బెడింగ్‌హామ్, ట్రిస్టన్ స్టబ్స్‌లు మొదటిసారిగా టెస్ట్ జట్టులో అవకాశం దక్కింది.
ఈ టూర్ లో భాగంగా 10,12,14 తేదీల్లో మూడు టీ20లు..17,19,21 న మూడు వన్డేలు జరుగుతాయి. డిసెంబర్ 26 నుంచి మూడు టెస్టుల సిరీస్ స్టార్ట్ అవుతుంది. భారత్ మూడు ఫార్మాట్ లకు ముగ్గురు కెప్టెన్లను సెలక్ట్ చేసింది. టెస్టు జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉంటాడు. వన్డేలకు రాహుల్, టీ20లకు సూర్య కుమార్ యాదవ్ భారత జట్టును లీడ్ చేస్తారు.
South Africa's?? squads for the Test, Odi & T20i series against India??? pic.twitter.com/tT1pUsPe7x
— CricketGully (@thecricketgully) December 4, 2023