2024 టీ20 వరల్డ్‌కప్‌కు దక్షిణాఫ్రికా జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టును దక్షిణాఫ్రికా మంగళవారం (ఏప్రిల్ 30) అనౌన్స్ చేసింది. ఈ జట్టుకు ఐడెన్ మార్కరం నాయకత్వం వహించనున్నాడు. జూన్ 1న పొట్టి ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ వరల్డ్‌కప్ టోర్నీకి వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ మెగా ఈవెంట్ కు ఇప్పటికే కివీస్ తమ 15 మంది స్క్వాడ్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే.
జట్టులో పెద్దగా సంచలనాలకు చోటివ్వలేదు. 2022 టీ20 ప్రపంచ కప్ ఆడిన వారే దాదాపుగా ఈ వరల్డ్ కప్ ఆడనున్నారు. ర్యాన్ రికెల్టన్,బార్ట్‌మన్ లాంటి కొత్త ఆటగాళ్లకు తొలిసారి చోటు దక్కింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్నారు. సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుండి మినహాయించబడిన అన్రిచ్ నోకియా, క్వింటన్ డి కాక్ 15 మంది ప్రాబబుల్స్ లో ఉన్నారు. రిజర్వ్ ప్లేయర్లుగా బర్గర్, లుంగీ ఎంగిడిలను సెలక్ట్ చేసింది.
మార్క్‌రామ్, డి కాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్‌లోతో బ్యాటింగ్ బలంగా కనిపిస్తుంది. మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీల,కగిసో రబాడ,నోకియా రూపంలో పేస్ బౌలర్లు.. జార్న్ ఫోర్టుయిన్, కేశవ్ మహారాజ్, తబ్రైజ్ షమ్సీలు స్పిన్నర్లుగా సెలక్టయ్యాడు.
దక్షిణాఫ్రికా టీ20 వరల్డ్ కప్ జట్టు:
ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్, జార్న్ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నో
SOUTH AFRICA SQUAD FOR T20 WORLD CUP 🏆
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 30, 2024
Markram (C), De Kock, Miller, Baartman, Nortje, Rabada, Coetzee, Fortuin, Hendricks, Jansen, Klaasen, Maharaj, Ryan Rickelton, Shamsi and Stubbs. pic.twitter.com/ChTqkyHWF3