CSA central contracts 2025-26: క్లాసన్‌కు బిగ్ షాక్.. సౌతాఫ్రికా మెన్స్ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ ఇదే!

CSA central contracts 2025-26: క్లాసన్‌కు బిగ్ షాక్.. సౌతాఫ్రికా మెన్స్ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ ఇదే!

సౌతాఫ్రికా మెన్స్ సెంట్రల్ కాంట్రాక్టులను లిస్ట్ వచ్చేసింది. సోమవారం (ఏప్రిల్ 7) 20 మంది సభ్యుల జాబితాతో కూడిన సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ క్రికెట్ సౌతాఫ్రికా ప్రకటించింది. వీరిలో స్టార్ బ్యాటర్లు డేవిడ్ మిల్లర్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్  హైబ్రిడ్ కాంట్రాక్టులు పొందారు. దీని ప్రకారం ఈ ఇద్దరూ అంగీకరించిన ద్వైపాక్షిక వైట్-బాల్ సిరీస్‌లతో పాటు ఐసీసీ టోర్నమెంట్‌లలో మాత్రమే ఆడతారు.ఇవి జూన్ 1, 2025 నుండి మే 31, 2026 వరకు ఈ కాంట్రాక్ట్ ఆటగాళ్లకు లభిస్తుంది.  

ఈ కాంట్రాక్ట్ లిస్ట్ లో విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ పేరు లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అన్రిచ్ నార్ట్జే, తబ్రైజ్ షంసీ పేర్లు కాంట్రాక్ట్ లిస్ట్ లో లేవు. క్లాసన్ కాంట్రాక్ట్ గురించి చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ వికెట్ కీపర్ బ్యాటర్  క్వింటన్ డి కాక్ లాగా అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి బదులుగా ఫ్రాంచైజ్ క్రికెట్ లో ఆడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. హెన్రిచ్ క్లాసెన్ భవిష్యత్తుకు సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయని.. త్వరలోనే తుది నిర్ణయం తీసుకోబడుతుందని క్రికెట్ సౌతాఫ్రికా ఒక ప్రకటనలో తెలిపింది. 

సౌతాఫ్రికా మెన్స్ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్:

టెంబా బావుమా, డేవిడ్ బెడింగ్‌హామ్, నాండ్రే బర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, టోనీ డి జోర్జి, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్‌సెన్, కేశవ్ మహరాజ్, క్వేనా మఫాకా, ఐడెన్ మార్క్‌రామ్, వియాన్ ముల్డర్, సెనురాన్ ముత్తుసామి, లుంగీ ఎన్‌గిడి, ట్రియాన్‌సిక్‌బ్స్‌టన్, ట్రియాన్‌సిక్‌బ్స్‌టన్, ట్రియాన్‌సిక్‌బ్యాడ వెర్రేన్నే, లిజాడ్ విలియమ్స్

హైబ్రిడ్ కాంట్రాక్ట్‌లు: డేవిడ్ మిల్లర్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్.