అద్భుతమైన జట్టు.. టాలెంట్ ఉన్న ఆటగాళ్లకు కొదువ లేదు.. స్టార్ ఆటగాళ్లతో కళకలాడుతుంది.. ఐసీసీ టోర్నీ అంటే ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది.. 32 ఏళ్లుగా వరల్డ్ కప్ ముందు వరకు సౌతాఫ్రికా ప్రస్తావన ఇది. అయితే దురదృష్టవశాత్తు ఆ జట్టు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఫైనల్ కు చేరుకోలేకపోయింది. వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఏడు సార్లు సెమీ ఫైనల్ కు చేరుకున్నా ఫైనల్ కళ మాత్రం అలాగే మిగిలిపోయింది. డివిలియర్స్, స్మిత్, ఆమ్లా, పొలాక్, డోనాల్డ్, ఎంతిని, లాంటి దిగ్గజాలు ఉన్నప్పటికీ ఆ జట్టును ఫైనల్ కు చేర్చలేకపోయారు.
ద్వైపాక్షిక సిరీస్ లో అదరగొట్టే సఫారీలు ఐసీసీ టోర్నీల్లో తడబడడం అలవాటైంది. ప్రతి సారి గ్రూప్ స్టేజ్ లో అదరగొట్టి నాకౌట్ చేరుకోవడం.. అక్కడ ఒత్తిడి జయించలేక ఇంటిదారి పట్టడం సౌతాఫ్రికాపై కామన్ అయిపోయింది. చోకర్స్ గా ముద్ర పడ్డ దక్షిణాఫ్రికా జట్టుకు టీ20 వరల్డ్ కప్ 2024 లో సెమీస్ కు చేరుతుందని ఎవరూ ఊహించలేదు. అయితే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఏకంగా ఫైనల్ కు చేరుకొని టైటిల్ సమరానికి సిద్ధమైంది.
తమ దేశ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఫైనల్ కు చేరుకొని చరిత్ర సృష్టించింది. కెప్టెన్ మార్కరం కెప్టెన్సీ, బౌలర్లు సమిష్టిగా రాణించడంతో వరల్డ్ కప్ లో సఫారీల జోరు కొనసాగుతుంది. గురువారం (జూన్ 27) ఆఫ్ఘనిస్తాన్ పై జరిగిన సెమీ ఫైనల్లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి ఫైనల్ కు అర్హత సాధించింది.
ఏడు సార్లు ఏడుపే మిగిలింది:
ఇప్పటివరకు సౌతాఫ్రికా వరల్డ్ కప్ చరిత్రలో మొత్తం 7 సార్లు సెమీ ఫైనల్ కు చేరుకుంది. వన్డే వరల్డ్ కప్ లో 1992, 1999,2007,2015 లలో సెమీస్ కు చేరుకుంది. తొలి ప్రయత్నంలో ఇంగ్లాండ్ పై అనూహ్యంగా ఓడిపోయిన ఆ జట్టు.. ఆ తర్వాత వరుసగా రెండు(1999,2007) సార్లు ఆసీస్ చేతిలో పరాజయం తప్పలేదు. 2015 లో న్యూజీలాండ్ పై చివరి వరకు పోరాడినా గెలుపు దక్కలేదు. భారత్ వేదికగా జరిగిన 2023 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లోనూ ఆస్ట్రేలియా నిరాశ తప్పలేదు. టీ20 వరల్డ్ కప్ విషయానికి వస్తే 2009లో తొలి సారి సెమీస్ కు చేరుకొని పాకిస్థాన్ పై 2014 లో భారత్ పై ఓడిపోయింది.
సెమీస్ లో ఆఫ్గన్ పై ఘన విజయం:
మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 11.5 ఓవర్లలో కేవలం 56 పరుగులకే ఆలౌటైంది. ఆఫ్గాన్ బ్యాట్స్ మెన్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్(10) మినహా మిగతా వారెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. నబీ (0), జనత్ (8), నూర్ ఆహ్మద్ (0), నవీనుల్ హక్ (2), కెప్టెన్ రషీద్ ఖాన్ (8)లు దారుణంగా విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో జాన్‌సెన్, షంసీ చెరో 3 వికెట్లు తీయగా.. రబాడా, నోకియా తలో 2 వికెట్లు పడగొట్టారు. లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా వికెట్ కోల్పోయి 8.5 ఓవర్లలో 60 పరుగులు చేసి మ్యాచ్ గెలిచింది.
57 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికాపై గొప్ప ఆరంభం లభించలేదు. 4 పరుగులు చేసిన డికాక్ రెండో ఓవర్లో ఫజల్ ఫారూఖీ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. ఈ దశలో కెప్టెన్ మార్కరంతో ఓపెన్ హేన్డ్రిక్స్ ఆచితూచి బ్యాటింగ్ చేశారు. చిన్నగా బ్యాటింగ్ చేస్తూ సౌతాఫ్రికాకు విజయాన్ని అందించారు. హేన్డ్రిక్స్(29), మార్కరం (23) నాటౌట్ గా నిలిచారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ కు ఒక వికెట్ దక్కింది.
South Africa finally did it.. pic.twitter.com/32nwu3uvzJ
— RVCJ Media (@RVCJ_FB) June 27, 2024