వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా టీంకి చోకర్స్ అనే ముద్ర ఉంది. లీగ్ మ్యాచులు బాగా ఆడటం నాకౌట్ లో కుదేలవ్వడం సఫారీల జట్టుకు సహజంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సారి మాత్రం ఫేవరేట్స్ గా కాకుండా అండర్ డాగ్ గా బరిలోకి దిగింది. పెద్దగా అంచనాలు లేకుండానే మొదటి మ్యాచులో బరిలోకి దిగిన ప్రొటీస్..వరల్డ్ కప్ లో ఒక్క మ్యాచులోనే ఏకంగా రెండు ఆల్ టైం రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఇంతకీ ఆ రెండు రికార్డులేంటో ఇప్పుడు చూద్దాం.
ఈ మ్యాచులో శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపిస్తూ దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 428 పరుగులు చేసింది.దీంతో వరల్డ్ కప్ లో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా దక్షిణాఫ్రికా రికార్డ్ సృష్టించింది. నిన్నటివరకు ఈ రికార్డ్ ఆస్ట్రేలియా పేరిట ఉంది. 2015 లో ఆఫ్ఘనిస్తాన్ పై కంగారూల జట్టు 417 పరుగులు చేసింది. భారత్ 2007 వరల్డ్ కప్ లో బెర్ముడాపై 413 పరుగులు చేసింది. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా జట్టు వరల్డ్ కప్ లో 400 మార్కుని టచ్ చేయడం ఇది మూడోసారి. వేరే ఏ జట్టు కూడా ఇన్ని సార్లు నాలుగొందల స్కోర్ చేయలేదు.
Highest team totals in #CricketWorldCup
— Tejan Shrivastava (@BeingTeJan) October 7, 2023
South Africa: 428/5 vs Sri Lanka
Australia: 417/7 vs Afghanistan
India: 413/5 vs Bermuda
South Africa: 411/4 vs Ireland
South Africa: 408/5 vs West Indies#SAvSL #CricketWorldCup2023 #CWC23 #Delhi pic.twitter.com/Dlzr3CF3zK
ఇక దక్షిణాఫ్రికా వైస్ కెప్టెన్ మార్కరం 49 బంతుల్లోనే సెంచరీ చేసి విధ్వంసం సృష్టించాడు. 49 బంతుల్లోనే సెంచరీ చేసిన మార్కరం మొత్తం 54 బంతుల్లో 106 పరుగులు చేసి వరల్డ్ కప్ లో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేసాడు. ఇప్పటివరకు ఈ రికార్డ్ ఐర్లాండ్ ప్లేయర్ కెవిన్ ఓబ్రెయిన్ పేరిట ఉంది. 2011 వరల్డ్ కప్ లో కెవిన్ ఓబ్రెయిన్ కేవలం 50 బంతుల్లోనే ఇంగ్లాండ్ పై సెంచరీ నమోదు చేసాడు.