- సౌతాఫ్రికా వన్డే టీ20, వన్డే కెప్టెన్‌గా మార్‌క్రమ్
- ఇండియాతో సిరీస్‌లకు సఫారీ జట్ల ప్రకటన
జొహనెస్‌బర్గ్ : టీమిండియాతో జరిగే వన్డే, టీ20 సిరీస్‌లో ఆతిథ్య సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవూమ, స్టార్ పేసర్ కగిసో రబాడ పాల్గొనడం లేదు. ఈ రెండు సిరీస్‌లకు దూరంగా ఉండి రెస్ట్ తీసుకున్న బవూమ, రబాడ తర్వాత జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం జట్టులోకి తిరిగిరానున్నారు. ఈ మేరకు ఈ నెల 10 నుంచి జరిగే మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్‌లో పాల్గొనే జట్లను క్రికెట్ సౌతాఫ్రికా సోమవారం ప్రకటించింది.
బవూమ గైర్హాజరీలో ఐడెన్ మార్‌క్రమ్ టీ20, వన్డే కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వికెట్ కీపర్ ట్రిస్టాన్ స్టబ్స్ తొలిసారి టెస్టు టీమ్‌లోకి వచ్చాడు. హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్‌ను టెస్టు టీమ్ నుంచి తప్పించారు. పేసర్లు కొయెట్జీ, మార్కో జాన్సెన్, లుంగి ఎంగిడి వన్డే టీమ్‌కు దూరంగా ఉన్నారు. ఈ ముగ్గురు టీ20లతో పాటు టెస్టు సిరీస్‌లో పాల్గొనున్నారు. ఈ నెల 10, 12, 14వ తేదీల్లో టీ20లు, 17, 19, 21వ తేదీల్లో వన్డేలు జరుగుతాయి. ఈనెల 26 నుంచి జరిగే తొలి టెస్టుతో ఇండియా, సౌతాఫ్రికా కొత్త వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ సైకిల్‌ను ప్రారంభిస్తాయి. జనవరి 3 నుంచి రెండో టెస్టు జరుగుతుంది.
సౌతాఫ్రికా టీ20 టీమ్: ఐడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, మాథ్యూ బ్రీట్జ్‌కే, నాండ్రే బర్గర్, కొయెట్జీ (తొలి రెండు టీ20లు), డొనోవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్ (తొలి రెండు టీ20), హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, డేవిడ్ మిల్లర్, ఎంగిడి (తొలి రెండు టీ20లు), ఫెలుక్వాయో, షంసీ, ట్రిస్టాన్ స్టబ్స్, లిజాద్ విలియమ్స్.
వన్డే టీమ్: మార్‌క్రమ్ (కెప్టెన్), బార్ట్‌మన్, నాండ్రే బర్గర్, టోనీ డిజోర్జి, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, మిహ్లాలీ ఎమ్‌పోంగ్వాన, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, ఫెలుక్వాయో, షంసీ, డుసెన్, కైల్ వెరెన్నె,లిజాడ్ విలియమ్స్. టెస్ట్ టీమ్: టెంబా బవూమ (కెప్టెన్), డేవిడ్ బెడింగ్‌హామ్, నాండ్రే బర్గర్, కోయెట్జీ, టోనీ డి జోర్జి, డీన్ ఎల్గర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, మార్ క్రమ్, వియాన్ ముల్డర్, ఎంగిడి, కీగన్ పీటర్సన్, రబాడ, ట్రిస్టా స్టబ్స్, కైల్ వెరెన్నె.