T20 World Cup 2024: ఆస్ట్రేలియా, శ్రీలంక వెనక్కి.. చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా

T20 World Cup 2024: ఆస్ట్రేలియా, శ్రీలంక వెనక్కి.. చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా

ఆంటిగ్వా వేదికగా సోమవారం (జూన్ 24) వెస్టిండీస్ తో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత వెస్టిండీస్ 135 పరుగులు చేయగా.. స్వల్ప లక్ష్యాన్ని సఫారీ బ్యాటర్లు ఆపసోపాలు పడుతూ చేధించారు. వరుణుడు అంతరాయం కలిగించి ఐడెన్ సేనను గట్టెక్కించాడు కానీ, లేదంటే ఫలితం మరోలా ఉండేది. ఆఖరి ఓవర్‌లో సఫారీ జట్టు విజయానికి 5 పరుగులు అవసరం కాగా.. మార్కో జెన్సన్ సిక్సర్ మలిచి జ‌ట్టుకు విజ‌యాన్ని అందించాడు. ఈ గెలుపుతో ప్రొటీస్ జట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధించడమే కాకుండా.. సరికొత్త రికార్డు తన ఖాతాలో వేసుకుంది. 

రోవ్‌మన్ పావెల్ సేనపై విజయం ప్రస్తుత టీ20 ప్రపంచ కప్ దక్షిణాఫ్రికాకు ఏడవది. తద్వారా ఒక ఎడిషన్‌లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన చరిత్రలో మొదటి జట్టుగా రికార్డు సృష్టించింది. గతంలో ఒక ఎడిషన్‌లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన రికార్డు శ్రీలంక, ఆస్ట్రేలియా  జట్ల పేరిట సంయుక్తంగా ఉంది. 2010, 2021 ఎడిషన్లలో ఆస్ట్రేలియా వరుసగా రెండుసార్లు ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇక లంకేయులు 2009 టీ20 వరుసగా ఆరింట గెలిచారు.

టీ20 ప్రపంచకప్‌లో వరుసగా అత్యధిక విజయాలు

  • 7: దక్షిణాఫ్రికా (2024)
  • 6: శ్రీలంక (2009)
  • 6: ఆస్ట్రేలియా (2010) 
  • 6: ఆస్ట్రేలియా (2021) 

లీగ్ దశలో శ్రీలంక, నెదర్లాండ్స్, బంగ్లాదే, నేపాల్‌ జట్లను ఓడించిన సఫారీ జట్టు.. సూపర్ 8 మ్యాచ్‌ల్లో అమెరికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్‌ జట్లను మట్టికరిపించింది.