పాక్‌కు షాక్.. టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన సౌతాఫ్రికా

పాక్‌కు షాక్.. టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన సౌతాఫ్రికా

కేప్‌‌టౌన్‌‌: వరల్డ్‌‌ టెస్టు చాంపియన్‌‌షిప్‌‌  (డబ్ల్యూటీసీ) ఫైనల్‌‌కు అర్హత సాధించిన సౌతాఫ్రికా సొంతగడ్డపై పాకిస్తాన్‌‌తో రెండు టెస్టుల సిరీస్‌‌ను 2–0తో క్లీన్‌‌స్వీప్ చేసింది. నాలుగో రోజు, సోమవారం ముగిసిన రెండో, చివరి టెస్టులో పది వికెట్ల తేడాతో పాక్‌‌ను చిత్తుగా ఓడించింది.  ఓవర్‌‌‌‌నైట్ స్కోరు 213/1తో ఫాలోఆన్‌‌ కొనసాగించిన పాక్ రెండో ఇన్నింగ్స్‌‌లో 478 స్కోరు వద్ద ఆలౌటై సౌతాఫ్రికాకు  58 రన్స్ టార్గెట్‌‌ మాత్రమే ఇచ్చింది. షాన్ మసూద్‌‌ (145) రాణించాడు. 

సఫారీ బౌలర్లలో రబాడ, కేశవ్‌‌ మహారాజ్‌‌ చెరో మూడు, యాన్సెన్ రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేజింగ్‌‌లో సౌతాఫ్రికా 7.1 ఓవర్లలోనే 61/0 స్కోరు చేసి గెలిచింది. డబుల్‌‌ సెంచరీ హీరో రికెల్టన్‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌, పేసర్ యాన్సెన్‌‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి.