వెస్టిండీస్‌లో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం క్రికెట్ సౌత్ ఆఫ్రికా (CSA) 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. వరల్డ్ కప్ కు ముందు ఇరు జట్లు ఆడుతున్న చివరి సిరీస్. విండీస్ లోనే వరల్డ్ కప్ జరగనుండడంతో ఈ సిరీస్ దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు ప్రాక్టీస్ గా ఉపయోగపడుతుందని భావించినా.. ఆ దేశ క్రికెట్ కీలక నిర్ణయం తీసుకుంది. స్టార్ ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చి విండీస్ కు ద్వితీయ శ్రేణి జట్టును పంపనుంది.
వరల్డ్ కప్ సమయానికి ఆటగాళ్లకు ఎలాంటి గాయాలు కాకుండా తాజాగా ఉండాలని క్రికెట్ సౌత్ ఆఫ్రికా ఈ నిర్ణయం తీసుకుంది. మే 23 నుంచి మే 26 వరకు విండీస్ లో మూడు టీ20లు జరుగుతాయి. ఈ మూడు మ్యాచ్ లకు జమైకా ఆతిధ్యమిస్తుంది. మార్కరంకు రెస్ట్ ఇవ్వడంతో రాస్సీ వాన్ డెర్ డుస్సెన్ ప్రొటీస్ జట్టు కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ జట్టులో ముగ్గురు స్టార్ ప్లేయర్లు డికాక్, నోకియా, కొయెట్జ్ లను సెలక్ట్ చేశారు.
కెప్టెన్ మార్క్‌రామ్, డేవిడ్ మిల్లర్, కగిసో రబాడ , ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్ , కేశవ్ మహరాజ్, మార్కో జాన్సెన్ లాంటి స్టార్ ఆటగాళ్ళు ఈ సిరీస్ కు అందుబాటులో ఉండరు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్లు ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్నారు. వీరిలో సన్ రైజర్స్ తరపున మార్కరం, క్లాసన్, మార్కో జాన్సెన్ ఉన్నారు. మరి వీరు ముగ్గురు సన్ రైజర్స్ ప్లే ఆఫ్ కు వెళ్తే ఆడతారా లేక రెస్ట్ తీసుకుంటారో చూడాలి.
వెస్టిండీస్ పర్యటనకు దక్షిణాఫ్రికా జట్టు:
రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఒట్నీల్ బార్ట్‌మాన్, మాథ్యూ బ్రీట్జ్‌కే, జార్న్ ఫార్టుయిన్, రీజా హెండ్రిక్స్, పాట్రిక్ క్రుగర్, వియాన్ ముల్డర్, లుంగి ఎన్‌గిడి , న్కాబా పీటర్, ర్యాన్ రికెల్టన్, ఆండిలే ఫెహ్లుక్‌వాయో , తబ్రైజ్ క్యూడ్‌టాన్ షామ్సీ