వరల్డ్ కప్ లో భాగంగా రెండో సెమీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా జట్లు సిద్ధమైపోయాయి. కోల్ కత్తా ఈడెన్ గార్డెన్స్ లో జరగనున్న ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఆదివారం(నవంబర్ 19) భారత్ తో వరల్డ్ కప్ ఫైనల్లో ఆడుతుంది. ఆఫ్ఘనిస్తాన్ పై జరిగిన మ్యాచ్ లో రెస్ట్ ఇచ్చిన మార్కో జాన్సెన్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు బంగ్లాదేశ్ మ్యాచ్ కు రెస్ట్ తీసుకున్న స్టార్క్, మ్యాక్స్ వెల్ ప్లేయింగ్ 11 లో చోటు సంపాదించారు.
2007 తర్వాత ఇరు జట్లు మరోసారి వన్డే వరల్డ్ కప్ సెమీస్ లో తలపడనున్నాయి. రెండు జట్లు సూపర్ ఫామ్ లో ఉండడంతో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ మ్యాచ్ లో గెలిచి టీమిండియాతో ఎవరు ఫైనల్ ఆడతారో చూడాలి.
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI):
క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డుసెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కోయెట్జీ, కగిసో రబడ, తబ్రైజ్ షమ్సీ
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI):
ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్ ), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్