WTC final: డేంజర్ జోన్‌లో భారత్.. టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్త్‌కు చేరువలో సౌతాఫ్రికా

WTC final: డేంజర్ జోన్‌లో భారత్.. టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్త్‌కు చేరువలో సౌతాఫ్రికా

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఈ సారి భారత్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్ కు చేరుకోవడం ఖాయమనుకుంటే అనూహ్యంగా సౌతాఫ్రికా రేస్ లోకి దూసుకొచ్చింది. అంతే కాదు ఫైనల్ బెర్త్ కు కేవలం ఒక్క విజయం దూరంలో నిలిచింది. ప్రస్తుత డబ్ల్యూటీసీలో సౌతాఫ్రికా టాప్ లో ఉంది. తమ తొలి ఐదు టెస్టుల్లో ఒక్కదాంట్లోనే నెగ్గిన సఫారీ టీమ్ గత ఐదు మ్యాచ్‌‌ల్లోనూ విజయం సాధించి  63.33 పీటీసీతో పట్టికలో అగ్రస్థానం అందుకుంది. 

ఈ నెల 26నుంచి స్వదేశంలో పాకిస్తాన్‌‌తో రెండు టెస్టులు ఆడనున్న సౌతాఫ్రికా ఒక్కదాంట్లో గెలిస్తే నేరుగా లార్డ్స్‌‌లో  జరిగే ఫైనల్‌‌కు రెడీ అవుతుంది. రెండింటిలో నెగ్గితే టాప్ ప్లేస్‌‌ కైవసం చేసుకుంటుంది. స్వదేశంలో పాకిస్థాన్ జట్టును ఒక్క మ్యాచ్ లో ఓడించడం సౌతాఫ్రికాపై పెద్ద కష్టమేమీ కాదు. దీంతో 2025 లార్డ్స్ లో జరగబోయే ఫైనల్ మ్యాచ్ కు సఫారీలు అర్హత సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. న్యూజిలాండ్ పై భారత్ క్లీన్ స్వీప్ కావడం.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి సమంగా ఉండడం సౌతాఫ్రికాపై అనుకూలంగా మారింది. 

ఇండియా పరిస్థితి ఏంటి..?
 
ఈ సైకిల్‌‌లో దాదాపు ఏడాది వరకూ అగ్రస్థానంలో కొనసాగిన ఇండియా తమ చివరి ఐదు టెస్టుల్లో నాలుగింటిలో (న్యూజిలాండ్‌‌తో 3, ఆస్ట్రేలియాతో1) ఓడిపోయి మూడో స్థానానికి పడిపోయింది.  మన జట్టుకు మరో మూడు టెస్టులే మిగిలున్నాయి. ఫైనల్ చేరాలంటే బోర్డర్‌‌–‌‌గావస్కర్ ట్రోఫీలోని ఈ మూడు మ్యాచ్‌‌ల్లో రెండింటిలో గెలిచి.. ఒకదాన్ని డ్రా చేసుకోవాల్సి ఉంటుంది.  ఒకవేళ ఇండియా 2-1తో ఈ సిరీస్ నెగ్గినా ఆసీస్‌‌కే చాన్స్‌‌ ఉంటుంది. లంకను 2-0తో ఓడిస్తే  ఆసీస్‌‌, పాకిస్తాన్‌‌తో ఆడే రెండు టెస్టుల్లో  ఓ మ్యాచ్‌‌ నెగ్గితే సౌత్రాఫికా ఫైనల్ చేరుతాయి.

ALSO READ : Mohammed Siraj: సిరాజ్ మంచి వ్యక్తిత్వం కలవాడు: తెలుగోడిపై జోష్ హాజెల్‌వుడ్ ప్రశంసలు

ఆస్ట్రేలియాకు ఎక్కువ ఛాన్స్ :

పింక్ టెస్టులో ఇండియాపై విక్టరీ తర్వాత టాప్ ప్లేస్‌‌కు వచ్చిన ఆస్ట్రేలియా ఒక్క రోజులోనే ఆ ప్లేస్‌‌ను సౌతాఫ్రికాకు కోల్పోయింది. ఆసీస్‌‌కు ఇంకా ఐదు టెస్టులు (ఇండియాతో 3, శ్రీలంకలో 2) మిగిలున్నాయి. బోర్డర్‌‌‌‌–గావస్కర్‌‌‌‌ ట్రోఫీలో ఇండియాపై రెండు విజయాలు సాధిస్తే.. శ్రీలంకతో సిరీస్ ఫలితంతో సంబంధం లేకుండా ఆ టీమ్ ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంటుంది. ఒకవేళ ఇండియాతో సిరీస్‌‌ 2–2తో డ్రా అయితే శ్రీలంకపై కనీసం ఒక్క టెస్టులో అయినా నెగ్గాల్సి ఉంటుంది.  అప్పుడు సౌతాఫ్రికా ఫలితాలపై ఆధారపడకుండా ఫైనల్ చేరుకుంటుంది. ఒకవేళ బోర్డర్‌‌‌‌–గావస్కర్ ట్రోఫీని 2–3తో కోల్పోయినా..  శ్రీలంకపై 2–0తో గెలిస్తే కూడా ఆసీస్‌‌ ముందంజ వేస్తుంది.