ముంబైలోని వాంఖడే స్టేడియం.. ఈ వినగానే మనకు వరల్డ్ కప్ ఫైనల్లో ధోని ఆడిన ఇన్నింగ్సే గుర్తుకొస్తుంది. 28 ఏళ్ళ తర్వాత మాహీ నాయకత్వంలో భారత జట్టు వరల్డ్ కప్ గెలిచింది ఇక్కడే కావడం విశేషం. అయితే ఈ గ్రౌండ్ లో మనకన్నా.. దక్షిణాఫ్రికా చెలరేగి ఆడుతుంది. ఇక్కడ మ్యాచ్ జరిగితే చాలు అలవోకగా భారీ స్కోర్ నమోదు చేస్తుంది. తాజాగా మరో భారీ స్కోర్ నమోదు చేసి ఈ స్టేడియంలో వారి రికార్డులను వారే బద్దలు కొట్టుకున్నారు.
వరల్డ్ కప్ లో భాగంగా నేడు(అక్టోబర్ 24) దక్షిణాఫ్రికాతో బంగ్లాదేష్ తలపడుతుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో సఫారీలు నిర్ణీత 50 ఓవర్లలో 382 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారీ స్కోర్ కొట్టడం సౌత్ ఆఫ్రికాకు అలవాటైనా.. వాంఖడేలో వరుసగా మూడు సార్లు 380 కి పైగా స్కోర్ చేసి ఈ గ్రౌండ్ ను తమ సొంత మైదానంగా మార్చుకుంది. 2015 లో తొలిసారి భారత్ పై రికార్డ్ స్థాయిలో 438 పరుగులు చేసిన ప్రొటీస్.. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో వరుసగా ఇంగ్లాండ్ పై 399, బంగ్లాదేశ్ పై 382 పరుగులు చేశారు.
ఒక గ్రౌండ్ లో ఇలా జట్టు వరుసగా ఇలా భారీ స్కోర్లు చేయడం క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. ఒకవేళ ఇలా జరిగిన సొంతగడ్డపై జరుగుతుంది. కానీ దక్షిణాఫ్రికా మాత్రం ఆడిన మూడు మ్యాచుల్లో అలవోకగా 380 పరుగులు దాటేసి ఔరా అనిపించింది. 1987 లో భారత్ శ్రీలంకపై ఈ గ్రౌండ్ లో 299 పరుగులు చేయడమే ఇప్పటివరకు అత్యధికం. ఇదే వేదికపై వరల్డ్ కప్ సెమీ ఫైనల్ 2 ఆడాల్సి ఉంది. ఒకవేళ భారత్, సౌత్ ఆఫ్రికా ఈ సెమీస్ ఆడల్సి వస్తే ఆ జట్టును ఓడించడానికి శక్తికి మించి పోరాడాలి.