వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో సౌతాఫ్రికాతో పాటు శ్రీలంక కూడా రేస్ ఉంది. శ్రీలంక మూడో స్థానంలో కొనసాగుతుంటే.. మరోవైపు సౌతాఫ్రికా నాలుగో స్థానంలో ఉంది. ఈ రెండు జట్లు మిగిలిన నాలుగు మ్యాచ్ లు గెలిస్తే టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు అర్హత సాధిస్తాయి. ఇందులో భాగంగా సౌతాఫ్రికాతో కీలకమైన టెస్ట్ సిరీస్ కు శ్రీలంక సిద్ధమవుతుంది. సొంతగడ్డపై ఆడుతుండడం సఫారీలకు కలిసి వస్తుంది. మరోవైపు సంచలనం కోసం లంక ఎదురు చూస్తుంది. ఇదిలా ఉంటే రెండు దేశాలు తమ జట్లను మంగళవారం (నవంబర్ 19) ప్రకటించాయి.
టెస్టు సిరీస్ లో భాగంగా నవంబర్ 27న కింగ్స్‌మీడ్‌లో తొలి టెస్ట్ జరుగతుంది. రెండో టెస్టు డిసెంబర్ 5 నుంచి పోర్ట్ ఎలిజబెత్‌లో జరగనుంది. ఇటీవలే స్వదేశంలో న్యూజిలాండ్ పై 2-0 తో టెస్ట్ సిరీస్ గెలిచిన శ్రీలంక.. ఈ సిరీస్ లోనూ గెలిస్తే టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరువవుతుంది. మరోవైపు సౌతాఫ్రికా ఇటీవలే బంగ్లాదేశ్ తో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.
ALSO READ | AUS vs IND 2024: ఆస్ట్రేలియాలో నా బెస్ట్ ఇన్నింగ్స్ అదే: విరాట్ కోహ్లీ
మోచేయి గాయం నుండి కోలుకున్న తర్వాత టెంబా బావుమా సౌతాఫ్రికా జట్టుకు కెప్టెన్సీ చేపట్టనున్నాడు. బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ కు దూరమైన మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ లాంటి కీలక ఆటగాళ్లు జట్టులో చేరారు. మరోవైపు శ్రీలంక టెస్ట్ జట్టుకు ధనంజయ డి సిల్వా నాయకత్వం వహిస్తాడు. 17 మంది సభ్యులతో కూడిన శ్రీలంక జట్టులో ఏంజెలో మాథ్యూస్, దిముత్ కరుణరత్నే, దినేష్ చండిమాల్ చోటు దక్కించుకున్నారు. స్పిన్నర్ ఎంబుల్దేనియాకు రెండు సంవత్సరాల తర్వాత జట్టులో స్థానం సంపాదించాడు.
సౌతాఫ్రికా జట్టు:
టెంబా బావుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్‌హామ్, గెరాల్డ్ కోయెట్జీ, టోనీ డి జోర్జి, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్రామ్, వియాన్ ముల్డర్, సెనురన్ ముత్తుసామి, డేన్ ప్యాటర్సన్, కగిసో రబడా, ట్రిస్టాన్‌కెల్బ్స్టన్, ర్యాన్ ర్యాన్ రస్టన్ , కైల్ వేరైన్
శ్రీలంక జట్టు:
ధనంజయ డి సిల్వా (కెప్టెన్), పాతుమ్ నిస్శాంక, దిముత్ కరుణరత్నే, దినేష్ చండిమాల్, ఏంజెలో మాథ్యూస్ , కుసాల్ మెండిస్ , కమిందు మెండిస్, ఓషద ఫెర్నాండో, సదీర సమరవిక్రమ, ప్రబాత్ జయసూర్య, నిషాన్ పీరిస్, లసిత్ ఎమ్బుల్దెనయకే, మిషాన్ పీరిస్, అస్లాన్ ఎఫ్బుల్దేనియా, అస్లాన్ ఎఫ్బుల్దేనియా, ఫెర్నాండో, లహిరు కుమార, కసున్ రజిత