దక్షిణాఫ్రికా పేసర్ గెరాల్డ్ కోయెట్జీ తన చిరకాల స్నేహితురాలు హన్నాను పెళ్లాడాడు. అతికొద్ది మంది సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులు నడుమ వీరి వివాహం జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలను కొయెట్జీ తన సోషల్‌మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేశాడు. సహచర ఆటగాళ్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
వరల్డ్ కప్‌లో మెరిసిన కొయెట్జీ
భారత్ వేదికగా ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచ కప్‌లో గెరాల్డ్ కొయెట్జీ అద్భుతంగా రాణించాడు. ఆ జట్టు ప్రధాన పేసర్ అన్రిచ్ నోర్జే గాయపడటంతో జట్టులోకి వచ్చిన ఈ యువ బౌలర్ అంచనాలను అందుకున్నాడు. 8 మ్యాచ్‌ల్లో 19.80 సగటుతో 20 వికెట్లు పడగొట్టాడు. అలాగే, బ్యాటింగ్‌లోనూ అప్పుడప్పుడు పర్వాలేదనిపించాడు.
Congratulations to the newly married couple, Mr & Mrs Coetzee.#GeraldCoetzee #CricketTwitter pic.twitter.com/E2PzWV6uQA
— InsideSport (@InsideSportIND) December 5, 2023
8 నెలల క్రితమే అరంగ్రేటం
కోయిట్జే 8 నెలల క్రితమే దక్షిణాఫ్రికా తరుపున అంతర్జాతీయ జట్టులో అరంగేట్రం చేశాడు. ప్రపంచకప్‌లోని అన్ని మ్యాచ్‌లతో కలిపి మొత్తం 14 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 31 వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్ 2024 వేలంలో భారీ ధర
వరల్డ్ కప్‌లో అద్భుతంగా రాణించిన నేపథ్యంలో కొయెట్జీకి ఐపీఎల్ 2024 వేలంలో భారీ ధర దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ రాణించగల సమర్ధుడు కనుక అతను కోసం ప్రాంఛైజీలు పోటీపడతాయని నివేదికలు వస్తున్నాయి. రూ.7 నుంచి రూ.9 కోట్లు పలకొచ్చని అంచనా వేస్తున్నారు.
Also Read :-కోల్కతా యువకుడిని పెళ్లి చేసుకునేందుకు ఇండియా వచ్చిన పాకిస్థాని యువతి