IND vs SA: అదరగొట్టిన కుర్రాళ్ళు.. సెమీఫైనల్లో భారత్ టార్గెట్ ఎంతంటే..?

IND vs SA: అదరగొట్టిన కుర్రాళ్ళు.. సెమీఫైనల్లో భారత్ టార్గెట్ ఎంతంటే..?

అండర్ 19 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో భాగంగా టీమిండియా బౌలర్లు రాణించారు. భారీ స్కోర్ వెళ్లకుండా దక్షిణాఫ్రికాను కట్టడి చేశారు. మొదటి సెమీ ఫైనల్లో బౌలర్లందరూ సమిష్టిగా రాణించడంతో భారత కుర్రాళ్ల ముందు సఫారీలు 245 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. టోర్నీ దక్షిణాఫ్రికా లో జరుగుతుండడంతో ఆతిధ్య జట్టుపై గెలవడం శక్తికి మించిన సవాలే. యువ బౌలర్ మఫాకాను మన కుర్రాళ్ళు ఎలా నిలువరిస్తారనే దానిపైనే టీమిండియా ఫైనల్ అవకాశాలు ఉన్నాయి.

బేనోనిలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై సఫారీలు ముందు నుంచి ఆచితూచి ఆడారు. దీంతో వికెట్లను ప్రాధ్యానమిచ్చే క్రమంలో పరుగుల వేగం మందగించింది. ఓపెనర్ ప్రిటోరియస్ 76 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిడిల్ ఆర్డర్ లో కీలకమైన 64 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో రాజ్ నింబాని 3 వికెట్లు తీసుకున్నాడు. ముషీర్ ఖాన్ కు రెండు వికెట్లు దక్కాయి. తివారి, పందేలకు తలో వికెట్ లభించింది. 

245 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియాకు మంచి ఆరంభం లభించలేదు. సఫారీ బౌలర్లు విజ్రంభించడంతో 8 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. మొదటి ఓవర్ తొలి బంతికే మఫాకా బౌలింగ్ లో ఓపెనర్ ఆదర్శ్ గోల్డెన్ డకౌటయ్యాడు. నాలుగో ఓవర్ రెండో బంతికి సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ (4) ఔటయ్యాడు. ప్రస్తుతం భారత్ నాలుగు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది.  క్రీజ్ లో కెప్టెన్ ఉదయ్ శరన్(0) తో పాటు ఓపెనర్ ఆర్షిన్ కులకర్ణి(0) ఉన్నారు.