- నేడు అఫ్గానిస్తాన్‌తో సౌతాఫ్రికాతో కీలక పోరు
- మ. 2 నుంచి స్టార్ స్పోర్ట్స్,హాట్ స్టార్‌లో లైవ్
అహ్మదాబాద్ : వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా ప్రి సెమీస్ మ్యాచ్‌కు సిద్ధమైంది. శుక్రవారం అఫ్గానిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఛేజింగ్ సమస్యలను పరిష్కరించుకోవాలని భావిస్తోంది. నాకౌట్ కావడంతో పూర్తి స్థాయిలో బ్యాటింగ్, బౌలింగ్‌పై దృష్టి సారించనుంది. టోర్నీ ఆరంభంలో బ్యాటింగ్‌లో విరుచుకుపడిన డికాక్, మార్‌క్రమ్, డసెన్‌తో పాటు కెప్టెన్ బవూమ బ్యాటింగ్‌పై దృష్టి పెట్టారు. మిడిలార్డర్‌లో క్లాసెన్, మిల్లర్ బ్యాట్లు ఝుళిపిస్తే సఫారీల కష్టాలు తీరినట్లే. అయితే కీలక టైమ్‌లో బవూమ సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఫెయిలవుతున్నాడు.
బౌలింగ్‌లో లెఫ్టార్మ్ పేసర్ జెన్‌సెన్, ఎంగిడి, రబాడలో నిలకడ లోపించింది. వేగంగా బాల్స్ వేస్తున్నా లైన్ అండ్ లెంగ్త్ మిస్సవుతున్నారు. ఈ మ్యాచ్‌లో ఈ తప్పులను సరిదిద్దుకోవాలని ప్లాన్స్ వేస్తున్నారు. కేశవ్ మహరాజ్‌కు తోడుగా ఎక్స్‌ట్రా స్పిన్నర్ తబ్రేజ్ శంసిని తీసుకునే యోచనలో ఉన్నారు. మరోవైపు సెమీస్ అవకాశాలు సన్నగిల్లడంతో ఈ మ్యాచ్‌లో సంచలనం చేయాలని అఫ్గానిస్తాన్ భావిస్తోంది. ఇప్పటికే నాలుగు విజయాలతో వరల్డ్ కప్‌లో తమదైన ముద్ర వేసిన అఫ్గాన్లు మరోసారి తమ ఆటతో వరల్డ్ క్రికెట్ మదిలో నిలవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపిస్తున్నా.. సఫారీలను కట్టడి చేయాలంటే మ్యాచ్ విన్నింగ్ స్పిన్ త్రయం రషీద్, నబీ, ముజీబ్ చెలరేగాలి. మరి ఆఖరి మ్యాచ్‌లో అఫ్గాన్ పంచ్ ఎలా ఉంటుందో చూడాలి.