వరల్డ్ కప్ లో మరో సెమీస్ సమరం నేడు(నవంబర్ 16) జరగనుంది. కోల్ కత్తా లోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో సౌత్ ఆఫ్రికా తలపడనుంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. 16 ఏళ్ళ తర్వాత కంగారూల జట్టుతో సఫారీలు సెమీస్ ఆడుతుండడంతో ఈ మ్యాచ్ ను చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా ఆడటం అనుమానంగా మారింది.
ఆఫ్ఘనిస్తాన్ తో చివరి లీగ్ మ్యాచ్ ఆడేటప్పుడు బవుమా గాయపడ్డాడు. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ చేసే సమయంలో అసౌకర్యంగా కనిపించిన దక్షిణాఫ్రికా 23 పరుగులు చేసి ఔటయ్యాడు. సెమీ ఫైనల్ కు ముందు రిస్క్ తీసుకోకూడదని భావించిన ఒక భారీ షాట్ కి ప్రయత్నించి ఔటయ్యాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా కెప్టెన్ హార్మ్ స్ట్రింగ్ గాయంతో బాధపడుతున్నాడు. దీంతో ఈ రోజు ఆస్ట్రేలితో జరిగే సెమీస్ కు దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. 100 శాతం ఫిట్ గ లేని బవుమా ఈ కీలక మ్యాచ్ కు దూరమైతే సఫారీల జట్టుకు గట్టి ఎదురు దెబ్బే అని చెప్పాలి.
బావుమ మ్యాచ్ సమయానికి కోలుకోకపోతే మార్కరం ఈ మ్యాచ్ కు కెప్టెన్ గా వ్యవరిస్తాడు. ఓపెనర్ హేన్డ్రిక్స్ బవుమా స్థానంలో డికాక్ తో కలిసి ఓపెనర్ గా బరిలోకి దిగుతాడు. చివరిసారి ఈ రెండు జట్లు 2007లో వరల్డ్ కప్ సెమీస్ లో తలపడగా ఆసీస్ విజయం సాధించింది. 1999 వరల్డ్ కప్ సెమీస్ లో సఫారీలపై ఆస్ట్రేలియాదే నెగ్గింది. మరి ఈ సారి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి. రెండు జట్లు సూపర్ ఫామ్ లో ఉండడంతో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం కనిపిస్తుంది.
Also Read :-వరల్డ్ కప్‌లో రోహిత్ సరికొత్త చరిత్ర..కెప్టెన్గా దిగ్గజాలను దాటేశాడు