![Tri-Series: ట్రై-సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. ఆరుగురు కొత్త ఆటగాళ్లకు చోటు](https://static.v6velugu.com/uploads/2025/02/south-africa-squad-for-the-first-odi-for-tri-series-in-pakistan_msjO8ACvEI.jpg)
పాకిస్థాన్ లో జరగనున్న ట్రై-సిరీస్‌కు సౌతాఫ్రికా క్రికెట్ తమ జట్టును ప్రకటించింది. తొలి వన్దే కోసం 12 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. స్క్వాడ్ లో ఏకంగా ఆరుగురు అన్‌క్యాప్డ్ ఆటగాళ్లకు చోటు దక్కడం విశేషం. టెంబా బావుమా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. గాయం నుంచి కోలుకొని ఫాస్ట్ బౌలర్ జెరాల్డ్ కోట్జీ జట్టులో స్థానం సంపాదించాడు. మీకా-ఈల్ ప్రిన్స్, గిడియన్ పీటర్స్, ఈతాన్ బాష్, మిహాలీ మ్పోంగ్వానా తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. టెస్ట్, టీ20 మ్యాచ్ లాడిన మాథ్యూ బ్రీట్జ్కే, సెనురాన్ ముత్తుసామి తొలిసారి వన్డే జట్టులో స్థానం సంపాదించారు.
ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్ ఆడుతూ బిజీగా ఉన్న కేశవ్ మహారాజ్, హెన్రిచ్ క్లాసెన్ రెండో వన్డే నుంచి అందుబాటులో ఉంటారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రాక్టీస్ గా పాక్ క్రికెట్ బోర్డు ఈ సిరీస్ ను ఏర్పాటు చేసినట్టుగా కనిపిస్తుంది. న్యూజిలాండ్, పాకిస్థాన్ మరో రెండు జట్లు. ఫిబ్రవరి 8న లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య తొలి మ్యాచ్ తో ఈ సిరీస్ ప్రారంభమవుతుంది. సౌతాఫ్రికా తమ తొలి మ్యాచ్ ఫిబ్రవరి 10న న్యూజిలాండ్ తో తలబడనుంది.
దక్షిణాఫ్రికా జట్టు (తొలి వన్డే కోసం):
టెంబా బావుమా (కెప్టెన్), ఈథన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, జెరాల్డ్ కోట్జీ, జూనియర్ డాలా, వియాన్ ముల్డర్, మిహ్లాలి ఎంపోంగ్వానా, సెనురాన్ ముత్తుసామి, గిడియన్ పీటర్స్, మీకా-ఈల్ ప్రిన్స్, జాసన్ స్మిత్, కైల్ వెర్రెయిన్.
ALSO READ | IND vs ENG, 1st ODI: ఇంగ్లాండ్ బ్యాటింగ్.. విరాట్ కోహ్లీ లేకుండానే మ్యాచ్
పాకిస్థాన్‌లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వన్డే ముక్కోణపు సిరీస్ షెడ్యూల్:
ఫిబ్రవరి 8, శనివారం – పాకిస్తాన్ vs న్యూజిలాండ్ – మధ్యాహ్నం 2:30 గంటలకు – గడాఫీ స్టేడియం, లాహోర్
ఫిబ్రవరి 10, సోమవారం – న్యూజిలాండ్ vs దక్షిణాఫ్రికా – ఉదయం 10:00 గంటలకు – గడాఫీ స్టేడియం, లాహోర్
ఫిబ్రవరి 12, బుధవారం – పాకిస్తాన్ vs దక్షిణాఫ్రికా – మధ్యాహ్నం 2:30 గంటలకు – నేషనల్ స్టేడియం, కరాచీ
ఫిబ్రవరి 14, శుక్రవారం – ఫైనల్ – మధ్యాహ్నం 2:30 గంటలకు – నేషనల్ స్టేడియం, కరాచీ
లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలంటే..?
ఇండియాలో ట్రై-సిరీస్ సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారమవుతుంది. OTT ప్లాట్‌ఫామ్ లో జియో సినిమాలో లైవ్ చూడొచ్చు.