భారత్ తో నాలుగు టీ20ల సిరీస్ కోసం సౌతాఫ్రికా టీమ్‌ను గురువారం (అక్టోబర్ 31) ప్రకటించారు. 16 మంది సభ్యులతో కూడిన బలమైన జట్టుకు ఎయిడెన్ మార్క్రామ్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. స్టార్ పేసర్ కగిసో రబడాకు ఈ సిరీస్‌లో విశ్రాంతి ఇవ్వబడింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ఇరు జట్లు టీ20 మ్యాచ్ ఆడుతుండడంతో ఈ సిరీస్ పై భారీ హైప్ నెలకొంది. పవర్-హిటర్‌లు డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్,ట్రిస్టన్ స్టబ్స్ సఫారీ జట్టులో చేరడంతో ఈ సారి భారత జట్టుకు గట్టి పోటీ తప్పదు.
ALSO READ | India A vs Australia A: కంగారులపై భారత్ అట్టర్ ఫ్లాప్.. 107 పరుగులకే ఆలౌట్
కేశవ్ మహరాజ్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీతో బౌలింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తుంది. ఆల్-రౌండర్ మిహ్లాలీ మ్పోంగ్వానా, అన్‌క్యాప్డ్ ఆల్-రౌండర్ ఆండిలే సిమెలనే తొలిసారి జట్టులో స్థానం సంపాదించారు. డర్బన్‌లోని కింగ్స్‌మీడ్‌లో తొలి టీ20 తో సిరీస్ ప్రారంభమవుతుంది. గ్కెబెర్హాలోని సెయింట్ జార్జ్ లో రెండో టీ20 జరుగుతుంది. సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్, జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్‌లో వరుసగా మూడు, నాలుగు టీ20 మ్యాచ్ లకు ఆతిధ్యమిస్తాయి. ఇప్పటికే భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే.
భారత్ తో సిరీస్ కు దక్షిణాఫ్రికా టీ20 జట్టు:
ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మాన్, గెరాల్డ్ కోయెట్జీ, డోనోవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, పాట్రిక్ క్రుగర్, కేశవ్ మహారాజ్, డేవిడ్ మిల్లర్, మిహ్లాలీ మ్పోంగ్వానా, న్కాబా పీటర్, ర్యాన్ సిర్డిపెలనేటన్, ఆండిలే స్ర్డిపెలనేటన్ (3,4వ టీ20), ట్రిస్టన్ స్టబ్స్
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ కు భారత జట్టు:
సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (కీపర్), రింకు సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణ్ దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్ వైశాక్, అవేష్ ఖాన్ , యష్ దయాల్.
SOUTH AFRICA SQUAD FOR INDIA T20I SERIES:
— Johns. (@CricCrazyJohns) October 31, 2024
Markram (C), Baartman, Coetzee, Donovan, Reeza, Jansen, Klaasen, Patrick Kruger, Maharaj, Miller, Mpongwana, Nqaba Peter, Rickelton, Andile Simelane, Sipamla, Stubbs pic.twitter.com/aeSByYpLXr