BAN vs SA 2024: బంగ్లాతో టెస్ట్ సిరీస్..బవుమా ఔట్.. బేబీ డివిలియర్స్ ఎంట్రీ

BAN vs SA 2024: బంగ్లాతో టెస్ట్ సిరీస్..బవుమా ఔట్.. బేబీ డివిలియర్స్ ఎంట్రీ

బంగ్లాదేశ్ తో రెండు టెస్టుల సిరీస్ కు సౌతాఫ్రికా జట్టును ప్రకటించారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో కీలకంగా మారిన ఈ సిరీస్ కు ముందు సఫారీ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్ బవుమా కండరాల గాయంతో తొలి టెస్టుకు దూరమయ్యాడు. 34 ఏళ్ల బవుమా.. ఇటీవలే ఐర్లాండ్ తో జరిగిన రెండో వన్డేలో నాన్‌స్ట్రైకర్స్ ఎండ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ చేయకుండానే మైదానం వీడాడు.ఈ క్రమంలో చివరి వన్డేకు దూరమయ్యాడు.

2022 లో భారత పర్యటనలో బావుమా టీ20 సిరీస్ సమయంలో మోచేతికి గాయం కాగా.. తాజాగా ఆ గాయం తిరగబెట్టింది. అతని స్థానంలో తొలి టెస్టుకు ఐడెన్ మార్క్రామ్ నాయకత్వం వహిస్తాడు. ప్రొటీస్ తరఫున రెండు టీ20 ఇంటర్నేషనల్స్ మ్యాచ్ లు ఆడిన డెవాల్డ్ బ్రెవిస్ ను బవుమా స్థానంలో ఎంపిక చేశారు. బ్రెవిస్ ఇప్పటివరకు 12 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో 37.45 సగటుతో 749 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు.. నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Also Read :- ఇదెక్కడి వింత..! పాక్ సెలక్షన్ బోర్డులో అంపైర్ అలీమ్ దార్

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తో ప్రపంచ టీ20 లీగ్ ల్లో ఈ యువ ఆటగాడు విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడతాడనే పేరుంది. మాజీ దక్షిణాఫ్రికా దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ శైలిలో ఆడుతూ అతడి వారసుడిగా పేరు తెచ్చుకున్నాడు. అక్టోబర్ 21 నుంచి మిర్పూర్‌లోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ స్టేడియంలో తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 29 న రెండో టెస్ట్ ప్రారంభమవుతుంది. 

బంగ్లాదేశ్ పర్యటనకు దక్షిణాఫ్రికా టెస్టు జట్టు

టెంబా బావుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్‌హామ్, మాథ్యూ బ్రీట్జ్‌కే, డెవాల్డ్ బ్రీవిస్, టోనీ డి జోర్జి, కేశవ్ మహరాజ్ , ఐడెన్ మార్క్రామ్ (మొదటి టెస్టుకు కెప్టెన్), వియాన్ ముల్డర్, సెనురన్ ముత్తుసామి, లుంగి ఎన్గిడి, డేన్ ప్యాటర్సన్, డేన్ పీడ్, ట్రిస్టన్ రబాడ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), కైల్ వెర్రేన్నే (వికెట్ కీపర్)