Champions Trophy 2025: ఆఫ్ఘనిస్తాన్ ఔట్.. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్‌కు సౌతాఫ్రికా

Champions Trophy 2025: ఆఫ్ఘనిస్తాన్ ఔట్.. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్‌కు సౌతాఫ్రికా

ఛాంపియన్స్ ట్రోఫీలో సౌతాఫ్రికా సెమీ ఫైనల్ కు దూసుకెళ్లింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో కరాచీ వేదికగా జరుగుతున్న మ్యాచ్ ముగియకుండానే నెట్ రన్ రేట్ తో సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ కేవలం 179పరుగులకే ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా టోర్నీ నుంచి నిష్క్రమించాలంటే ఇంగ్లాండ్ 207 పరుగుల తేడాతో నెగ్గాలి. కానీ బట్లర్ సేన కనీసం 200 పరుగుల మార్క్ అందుకోలేకపోయింది. దీంతో సౌతాఫ్రికా సెమీస్ కు చేరగా.. ఆఫ్ఘనిస్తాన్ టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. 

వరుస విరాల్లో ఇంగ్లాండ్ వికెట్లు:

చివరి మ్యాచ్ లో గెలిచి పరువు నిలుపుకోవాలని చూసిన ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసి తీవ్రంగా నిరాశపరిచింది. 38.2 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌట్ అయింది. పవర్ ప్లే లో సఫారీ బౌలర్లు విజృంభించడంతో సాల్ట్ (8) తొలి ఓవర్ లోనే డకౌట్ గా వెనుదిరిగాడు. పేలవ ఫామ్ లో ఉన్న  జెమీ స్మిత్ డకౌటయ్యాడు. ఉన్నంత సేపు వేగంగా ఆడిన డకెట్ 24 పరుగుల వద్ద ఔటయ్యాడు. మూడు వికెట్లు మార్కో జాన్సెన్ తీసుకోవడం విశేషం. ఆ తర్వాత ఏ దశలోనూ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముందుకు సాగలేదు. 

Also Read :- కరుణ్ నాయర్ సెంచరీ.. టైటిల్‌కు చేరువలో విదర్భ

రూట్ 37 పరుగులు చేసి పర్వాలేదనిపించగా.. మిగిలిన వారు విఫలమయ్యారు. వరుస విరామాల్లో ఆ జట్టు వికెట్లను కోల్పోతూ వచ్చింది. , హ్యారీ బ్రూక్(19), జోస్ బట్లర్(21), లియామ్ లివింగ్‌స్టోన్(9), జేమీ ఓవర్టన్(11), జోఫ్రా ఆర్చర్(25), ఆదిల్ రషీద్(2) విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్, మల్డర్ తలో మూడు వికెట్లు తీసుకున్నారు. కేశవ్ మహరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఎంగిడి, రబడాలకు తలో వికెట్ దక్కింది.