ఇండియాతో తలపడేదెవరో.. సౌతాఫ్రికాపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

ఇండియాతో తలపడేదెవరో.. సౌతాఫ్రికాపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

దుబాయ్: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మరో రసవత్తర పోరుకు సమయం ఆసన్నమైంది. న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరగనున్న సెకండ్ సెమీ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ రెండు జట్లలో ఎలాంటి మార్పులుచేర్పులు లేవు. సేమ్ టీమ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్ మ్యాచ్లో టీమిండియాను ఢీ కొట్టబోతోంది. వరల్డ్ క్లాస్ ప్లేయర్లు, మేటి ఆటగాళ్లు ఉన్నా ఐసీసీ ఈవెంట్లలో తడబడుతున్న న్యూజిలాండ్‌‌‌‌, సౌతాఫ్రికా చాంపియన్స్ ట్రోఫీని ముద్దాడేందుకు ముందడుగు వేయాలని చూస్తున్నాయి.

సఫారీ టీమ్, కివీస్‌‌‌‌ చాంపియన్స్ ట్రోఫీలో (1998, 2000) చెరోసారి విజేతగా నిలిచాయి. ఐసీసీ నాకౌట్ ట్రోఫీలుగా పిలిచిన ఆ రెండు ఎడిషన్లకు ఇప్పటి మాదిరిగా ప్రాముఖ్యత లేదు. పెద్ద టోర్నీల్లో తడబడే సఫారీలు గతేడాది టీ20 వరల్డ్ కప్‌‌‌‌ ఫైనల్లో ఓడిపోయారు. మరోవైపు కివీస్  2015, 2019 వన్డే వరల్డ్ కప్స్,  2021 టీ వరల్డ్ కప్‌‌‌‌లో ఫైనల్‌‌‌‌ చేరినా ఆఖరి అంకాన్ని దాటలేకపోయింది. ఈసారి ఎలాగైనా ఐసీసీ ట్రోఫీని చేజిక్కించుకోవాలని రెండు జట్లూ ఆశిస్తున్నాయి. శాంట్నర్ కెప్టెన్సీలోని న్యూజిలాండ్ గ్రూప్‌‌‌‌–లో ఇండియా తర్వాత రెండో స్థానంలో నిలవగా.. గ్రూప్‌‌‌‌–బిలో సౌతాఫ్రికా టాప్ ప్లేస్‌‌‌‌ సాధించింది.