దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు ప్రతి సంవత్సరం ఒక వన్డే మ్యాచ్ పింక్ కలర్ ధరిస్తుంది. ఈ ఏడాది కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. నేడు భారత్ తో తలపడే తొలి వన్డేకు పింక్ కలర్ జెర్సీలో కనిపించనున్నారు. సాధారణంగా దక్షిణాఫ్రికా క్రికెటర్లు గ్రీన్ కలర్ జెర్సీ ధరిస్తారు. కానీ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవగాహన కలిపించేందుకు పింక్ కలర్ జెర్సీని వేసుకునేందుకు సిద్ధమయ్యారు.
జోహనెస్ బర్గ్ లోని వాండరర్స్ స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య నేడు(డిసెంబర్ 17) మ్యాచ్ జరగనుంది. టీ20 సిరీస్ 1-1తో ముగించిన సఫారీలు.. వన్డే సిరీస్ ఎలాగైనా గెలవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. రాహుల్ సారధ్యంలోని కుర్రాళ్లతో నిండిన ఈ జట్టుతో భారత్ బరిలోకి దిగుతుంటే.. మరోవైపు మార్కరం కెప్టెన్సీలో దక్షిణాఫ్రికా జట్టు సొంతగడ్డపై పటిష్టంగా కనబడుతుంది.
మధ్యాహ్నం 1:30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ మ్యాచ్ లైవ్ ప్రసారమవుతుంది. మూడు వన్డేలో సిరీస్ లో భాగంగా డిసెంబర్ 19 న రెండో వన్డే, డిసెంబర్ 21 న మూడో వన్డే జరుగుతాయి. వన్డే సిరీస్ అనంతరం డిసెంబర్ 26 నుంచి తొలి టెస్ట్ సిరీస్ ప్రారంభం అవుతుంది.
South Africa will be wearing Pink jersey in the 1st ODI vs India today??
— Salman Khan (@SalmanK53465481) December 17, 2023
But why pink comment below and rate how they look❤️??#INDvSA pic.twitter.com/HU1dJnNeLj