అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత్, సౌతాఫ్రికా జట్లు ఫైనల్ పోరుకు సిద్ధమయ్యాయి. కౌలాలంపూర్ వేదికగా జరుగుతున్న ఈ తుది సమరంలో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. శుక్రవారం(జనవరి 31) ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించి టీమిండియా ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. మరోవైపు సౌతాఫ్రికా సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్ కు అర్హత సాధించింది. స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ఈ మ్యాచ్ లైవ్ ప్రసారమవుతుంది.
అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌లో తిరుగులేని పెర్ఫార్మెన్స్ చేస్తూ ఎదురైన ప్రత్యర్థినల్లా మట్టికరిపిస్తున్న యంగ్ ఇండియా విమెన్స్ టీ20 అండర్19 వరల్డ్ కప్‌లో వరుసగా రెండో టైటిల్‌పై గురి పెట్టింది. అనూహ్యంగా ఫైనల్‌కు వచ్చిన సౌతాఫ్రికాను ఇండియా తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఆ జట్టు కూడా అజేయంగా తుదిపోరుకు చేరుకుంది. సెమీస్‌లో బలమైన ఆస్ట్రేలియాకు చెక్ పెట్టింది. దీంతో ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా జరుగుతుందని ఎక్స్ పర్ట్స్ భావిస్తున్నారు.
Also Read : ప్రయోగాలపై టీమిండియా దృష్టి.. చివరి టీ20కి నలుగురికి రెస్ట్
దక్షిణాఫ్రికా మహిళల U19 (ప్లేయింగ్ XI):
జెమ్మా బోథా, సిమోన్ లౌరెన్స్, డయారా రామ్లాకన్, ఫే కౌలింగ్, కైలా రేనెకే(కెప్టెన్), కరాబో మెసో(వికెట్ కీపర్), మైకే వాన్ వూర్స్ట్, షెష్నీ నాయుడు, ఆష్లీ వాన్ వైక్, మోనాలిసా లెగోడి, న్తాబిసెంగ్ నిని
భారత మహిళల U19 (ప్లేయింగ్ XI):
కమలిని(వికెట్ కీపర్), గొంగడి త్రిష, సానికా చల్కే, నికి ప్రసాద్(కెప్టెన్), ఈశ్వరి అవ్సరే, మిథిలా వినోద్, ఆయుషి శుక్లా, జోషిత , షబ్నం మహమ్మద్ షకీల్, పరుణికా సిసోడియా, వైష్ణవి శర్మ