Champions Trophy 2025:సఫారీలు బోణీ: సౌతాఫ్రికా చేతిలో ఆఫ్ఘనిస్తాన్ చిత్తు

Champions Trophy 2025:సఫారీలు బోణీ: సౌతాఫ్రికా చేతిలో ఆఫ్ఘనిస్తాన్ చిత్తు

ఛాంపియన్స్ ట్రోఫీలో సౌతాఫ్రికా తొలి విజయాన్ని అందుకుంది. గ్రూప్ బి లో భాగంగా శుక్రవారం (ఫిబ్రవరి 21) జరిగిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ పై సఫారీలు 107 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించారు. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 315 పరుగుల భారీ స్కోర్ చేసింది.  ఓపెనర్ ర్యాన్ రికెల్టన్(103: 106 బంతుల్లో.. 7 ఫోర్లు, సిక్సర్) సెంచరీతో పాటు కెప్టెన్ బవుమా(58), రాస్సీ వాన్ డెర్ డస్సెన్(52),ఐడెన్ మార్క్రామ్(52) హాఫ్ సెంచరీలతో రాణించారు. లక్ష్య ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ 43.3 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌట్ అయింది. రహ్మత్ షా(90) చివరి వరకు పోరాడినా అతనికి సహకరించేవారు కరువయ్యారు. 

316 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ ఏ దశలోనూ లక్ష్యాన్ని అందుకునేలా కనిపించలేదు. ఆ జట్టు వరుస విరామాల్లో వికెట్లను కోల్పోతూ వస్తుంది. దీంతో 50 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయి మ్యాచ్ పై ఆశలు వదిలేసుకుంది. ఈ దశలో రహ్మత్ షా ఒక్కడే వారియర్ లా పోరాడాడు. సహచర ప్లేయర్లు విఫలమైనా సెంచరీతో జట్టు పరువును కాపాడాడు. 90 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచి సెంచరీ మిస్ చేసుకున్నాడు. మిగిలిన వారిలో ఏ ఒక్కరు కూడా కనీసం 20 పరుగులు చేయలేకపోయారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబడా మూడు వికెట్లు పడగొట్టాడు. ఎంగిడి, మల్డర్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. 

అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 315 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్(103: 106 బంతుల్లో.. 7 ఫోర్లు, సిక్సర్) సెంచరీతో పాటు కెప్టెన్ బవుమా(58), రాస్సీ వాన్ డెర్ డస్సెన్(52),ఐడెన్ మార్క్రామ్(52) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆరంభంలోనే ఆ జట్టు వికెట్ కోల్పోయింది. టోనీ డి జోర్జీ 11 పరుగులు చేసి నబీ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఈ దశలో కెప్టెన్ ఓపెనర్ రికెల్టన్, బవుమా ఇన్నింగ్స్ ను ముందు తీసుకెళ్లారు. ఆఫ్గన్ బౌలర్లను ఈజీగా ఆడిస్తూ భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 

రెండో వికెట్ కు ఏకంగా 129 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారీ స్కోర్ కు బాటలు వేశారు. ఈ క్రమంలో వీరిద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. హాఫ్ సెంచరీ తర్వాత బవుమా(58) ఔటైనా.. వాన్ డెర్ డస్సెన్ సహకారంతో రికెల్టన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మిల్లర్ విఫలమైనా డస్సెన్, మార్కరం హాఫ్ సెంచరీలతో సౌతాఫ్రికా స్కోర్ బోర్డును 300 పరుగులు దాటించారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో మహమ్మద్ నబీ రెండు వికెట్లు పడగొట్టాడు. ఫరూఖీ, ఓమర్జాయ్, నూర్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.