డర్బన్ : బౌలింగ్‌లో పేసర్ మార్కో యాన్సెస్ (11/86) దుమ్మురేపడంతో.. శ్రీలంకతో నాలుగు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా 233 రన్స్ తేడాతో భారీ విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో హోమ్ టీమ్ 1–0 లీడ్‌లో నిలిచింది. 516 రన్స్ టార్గెట్‌ను ఛేదించేందుకు 103/5 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం నాలుగో రోజు బరిలోకి దిగిన లంక రెండో ఇన్నింగ్స్‌లో 79.4 ఓవర్లలో 282 రన్స్‌కు ఆలౌటైంది.
దినేశ్ చండిమల్ (83), ధనంజయ్ డిసిల్వ (59), కుశాల్ మెండిస్ (48) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. యాన్సెన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.