
న్యూఢిల్లీ: సౌతాఫ్రికా యంగ్ ఆల్‌రౌండర్ డెవాల్డ్ బ్రేవిస్‌ను తమ జట్టులోకి తీసుకున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) శుక్రవారం (ఏప్రిల్ 19) ప్రకటించింది. గాయపడ్డ పేసర్ గుర్జపనీత్ సింగ్ స్థానంలో రూ. 2.2 కోట్ల ధరతో సీఎస్కే టీమ్‌లోకి వచ్చిన బ్రేవిస్ ఈ ఐపీఎల్ మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడు.
2023లో సౌతాఫ్రికా తరఫున అరంగేట్రం చేసిన అతను ఐపీఎల్, సీపీఎల్, ఎంఎల్‌సీ, ఎస్‌ఏ20 లాంటి లీగ్స్‌లో తన టాలెంట్ చూపెట్టాడు. 21 ఏండ్ల బ్రేవిస్ 2022, 2024లో ముంబై ఇండియన్స్ తరఫున 10 మ్యాచ్‌లు ఆడాడు.