సౌతాఫ్రికా టీ20లీగ్..మిల్లర్కే పార్ల్ రాయల్స్ పగ్గాలు

సౌతాఫ్రికా టీ20లీగ్..మిల్లర్కే పార్ల్ రాయల్స్ పగ్గాలు

సౌతాఫ్రికా టీ20లీగ్లో రాజస్థాన్ రాయల్స్ టీమ్కు కెప్టెన్గా డేవిడ్ మిల్లర్ వ్యవహరించబోతున్నాడు. ఎస్ఎటీ20 లీగ్లో తమ ఫ్రాంచైజీకి కెప్టెన్గా డేవిడ్ మిల్లర్ను నియమిస్తున్నట్లు రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ నిర్ణయించింది. ఈ మేరకు ట్విట్టర్లో ప్రకటించింది. 

పార్ల్ రాయల్స్..
2023 జనవరిలో  దక్షిణాఫ్రికా వేదికగా ఎస్ఎటీ20 లీగ్ ప్రారంభం కానుంది. ఇందులో రాజస్తాన్ రాయల్స్  ఒక ఫ్రాంచైజీని కొనుగొలు చేసింది. ఆ ఫ్రాంచైజీకి  పార్ల్ రాయల్స్గా  నామకరణం చేసింది. ఈ జట్టు పగ్గాలను  సౌతాఫ్రికా డాషింగ్ బ్యాట్స్మన్ డేవిడ్ మిల్లర్కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.   ఎస్ఎటీ20 ఫస్ట్ ఎడిషన్లో తమ టీమ్కు మిల్లర్ సారథ్య బాధ్యతలను మోస్తాడని తెలిపింది.  ఇందుకు సంబంధించి మిల్లర్తో ఓ చిన్న వీడియో బైట్ను కూడా విడుదల చేసింది. వీడియోలో మిల్లర్.. హలో  నేను డేవిడ్ మిల్లర్... పార్ల్ రాయల్స్ కెప్టెన్ను.. అంటూ ఫోన్లో మాట్లాడాడు. 

ఆర్ఆర్ తరపున ఆడిన మిల్లర్..
పార్ల్ రాయల్స్కు కెప్టెన్గా ఎంపికైన డేవిడ్ మిల్లర్ గతంలో ఐపీఎల్లో  రాజస్తాన్ రాయల్స్ తరపున ఆడాడు. 2020, 2021 ఐపీఎల్లో  మిల్లర్.. రాజస్తాన్కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ  సీజన్లలో అతను స్థాయికి తగ్గట్లు రాణించలేదు. దీంతో అతడిని వేలానికి వదిలేసింది. ఆ తర్వాత వేలంలో మిల్లర్ను  గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. 2022 ఐపీఎల్లో  గుజరాత్ తరపున 16 మ్యాచ్లు ఆడిన మిల్లర్ 481 రన్స్ సాధించాడు. 

పార్ల్ రాయల్స్ టీమ్: డేవిడ్ మిల్లర్ (కెప్టెన్ ), జోస్ బట్లర్, ఒబెడ్ మెక్ కాయ్ వంటి వారు కూడా పార్ల్ టీమ్లో ఉన్నారు. ఈ జట్టుకు  సౌతాఫ్రికా  మాజీ ప్లేయర్ జేపీ డుమిని హెడ్ కోచ్గా వ్యవహరించనున్నాడు.