దక్షిణాఫ్రికా ఫుట్‌బాల్ ప్రపంచంలో దారుణం చోటుచేసుకుంది. యువ ఫుట్‌బాలర్ ల్యూకె ఫ్లెయర్స్(24)ను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. బుధవారం(ఏప్రిల్ 3) రాత్రి జొహన్నెస్‌బర్గ్‌లో ఓ పెట్రోల్ బంక్ వద్ద వేచి ఉన్న అతనిపై కాల్పులు జరిపారు. దాంతో ఫ్లెయర్స్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతని దగ్గరకు వెళ్లి.. కారు నుండి దిగమని ఆదేశించారు. అనంతరం అతన్ని బయటకు లాగి కడుపు పైభాగంలో తుపాకీతో కాల్చారు. ఆపై అతని కారులోనే అక్కడి నుండి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫ్లెయర్స్ మరణంపై అతను ప్రాతినిధ్యం వహిస్తున్న కైజెర్ చీఫ్స్ ఫుట్‌బాల్ క్లబ్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
🚨 24-year-old South African defender Luke Fleurs has been shot dead during a car-jacking incident in Johannesburg. 🇿🇦
— Transfer News Live (@DeadlineDayLive) April 4, 2024
Our thoughts are with his family and friends at this heartbreaking time. 🕊️💔
(Source: BBC) pic.twitter.com/QB9CV4wDYb
24 ఏళ్ల ఫ్లెయర్స్ టోక్యో ఒలింపిక్స్‌లో అండర్-23 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఫ్లెయర్స్ తన 17వ ఏట నేషనల్ ఫస్ట్ డివిజన్ (NFD) అరంగేట్రం చేసాడు. అనంతరం కొన్నాళ్ళకు సూపర్‌స్పోర్ట్ యునైటెడ్‌లో చేరాడు. 2018 నుండి 2023 వరకు 56 మ్యాచ్‌లలో ఆడాడు. అతను గతేడాది అక్టోబర్‌లో ప్రీమియర్‌షిప్ సైడ్ కైజర్ చీఫ్స్‌లో చేరారు.