ఐపీఎల్లో కవలల ఎంట్రీ.. లెఫ్టార్మ్ పేసర్లు..రైట్ హ్యాండ్ బ్యాటర్లు...

ఐపీఎల్లో కవలల ఎంట్రీ.. లెఫ్టార్మ్ పేసర్లు..రైట్ హ్యాండ్ బ్యాటర్లు...

ఐపీఎల్లో  గతంలో అన్నదమ్ములు హవా నడిచింది. అన్నదమ్ములైన  దీపక్ చాహర్, రాహుల్ చాహర్, కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యాలు  తమ జట్ల తరపున సత్తా చాటారు. అయితే ఐపీఎల్2023 లో  తొలిసారిగా కవలలు ఆడబోతున్నారు. సౌతాఫ్రికాకు చెందిన ట్విన్స్..ప్రత్యర్థులుగా బరిలోకి దిగబోతున్నారు. 

 
సేమ్ టూ సేమ్..

సౌతాఫ్రికాకు చెందిన మార్కో యాన్సెన్, డుయాన్ యాన్సెన్ లు కవల పిల్లలు. వీరిద్దరూ 2000 మే 1న జన్మించారు. చూడటానికి ఇద్దరూ ఒకేలా ఉంటారు. ఇద్దరూ ఆల్ రౌండర్లు. ఒకే విధంగా బౌలింగ్, బ్యాటింగ్ చేస్తారు. 

మార్కో యాన్సెస్..

మార్కో యాన్సెన్  సౌతాఫ్రికా తరఫున అరంగేట్రం చేశాడు. ఈ ఐపీఎల్ లో అతడు సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున బరిలోకి దిగనున్నాడు. సన్ రైజర్స్ తరఫున మెరుగ్గా రాణించాలని మార్కో యాన్సెన్ కృతనిశ్చయంతో ఉన్నాడు. మార్కో యాన్సెస్  లెఫ్టార్మ్ పేసర్...రైట్ హ్యాండ్ బ్యాటర్.

డుయాన్ యాన్సెన్...

డుయాన్ యాన్సెన్ గతేడాది జరిగిన మినీ వేలంలో ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది.  డుయాన్ మాత్రం సౌతాఫ్రికా తరపున ఎంట్రీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 16వ సీజన్ లో సత్తా చాటి..సౌతాఫ్రికా టీమ్లో చోటు దక్కించుకోవాలని డుయాన్ భావిస్తున్నాడు. అన్నట్లు డుయాన్ యాన్సెన్ కూడా లెఫ్టార్మ్ బౌలరే. రైట్ హ్యాండ్ బ్యాట్స్మన్. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్  మధ్య జరిగే మ్యాచులో వీరిద్దరికి తుది జట్టులో చోటు దక్కితే..తొలిసారి ఐపీఎల్ లో కవలల మధ్య  ఫైట్ను చూసే అవకాశం దక్కుతుంది.