29 ఏండ్ల తర్వాత షెఫీల్డ్ షీల్డ్ టైటిల్‌‌‌‌ నెగ్గిన సౌత్‌‌‌‌ ఆస్ట్రేలియా

29 ఏండ్ల తర్వాత షెఫీల్డ్ షీల్డ్ టైటిల్‌‌‌‌ నెగ్గిన సౌత్‌‌‌‌ ఆస్ట్రేలియా

అడిలైడ్‌‌‌‌: ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ షోతో ఆకట్టుకున్న సౌత్‌‌‌‌ ఆస్ట్రేలియా 29 ఏండ్ల తర్వాత తొలిసారి షెఫీల్డ్‌‌‌‌ షీల్డ్‌‌‌‌ టైటిల్‌‌‌‌ను సొంతం చేసుకుంది. శనివారం ముగిసిన ఫైనల్లో సౌత్‌‌‌‌ ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో క్వీన్స్‌‌‌‌లాండ్‌‌‌‌పై గెలిచింది. క్వీన్స్‌‌‌‌లాండ్‌‌‌‌ నిర్దేశించిన 270 రన్స్‌‌‌‌ లక్ష్యాన్ని ఛేదించేందుకు శనివారం బరిలోకి దిగిన సౌత్‌‌‌‌ ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో 69.1 ఓవర్లలో 270/6 స్కోరు చేసి నెగ్గింది. జాసన్‌‌‌‌ సంగా (126 నాటౌట్‌‌‌‌), అలెక్స్‌‌‌‌ క్యారీ (105) సెంచరీలతో దంచికొట్టారు. 

ఈ ఇద్దరు కలిసి నాలుగో వికెట్‌‌‌‌కు 202 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ నెలకొల్పారు. మార్క్ స్టెకీటీ 3 వికెట్లు తీశాడు. అంతకుముందు క్వీన్స్‌‌‌‌లాండ్‌‌‌‌ రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో 136.2 ఓవర్లలో 445 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. జాక్‌‌‌‌ క్లెటాన్‌‌‌‌ (100), జాక్‌‌‌‌ విడెర్‌‌‌‌ముత్‌‌‌‌ (111) సెంచరీలు చేయగా, మార్నస్‌‌‌‌ లబుషేన్‌‌‌‌ (61), మార్క్‌‌‌‌ స్టెకీటీ (51) హాఫ్‌‌‌‌ సెంచరీలు సాధించారు. బ్రెండన్‌‌‌‌ డాగెట్‌‌‌‌ 5, నేథన్‌‌‌‌ మెక్‌‌‌‌అండ్రూ 3 వికెట్లు పడగొట్టారు.