సికింద్రాబాద్, వెలుగు: ప్రయాణికుల రద్దీని పురస్కరించుకుని ఈ నెల13 నుంచి19 వరకు వివిధ మార్గాల్లో స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) అధికారులు వెల్లడించారు. తిరుపతి – నాగర్సోల్– తిరుపతి,- తిరుపతి– -సికింద్రాబాద్–-తిరుపతి, తిరుపతి–-నాందేడ్, కాకినాడ టౌన్–-తిరుపతి–-కాకినాడ టౌన్స్టేషన్ల మధ్య ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ స్పెషల్ ట్రైన్స్ రేణిగుంట, కొందూరు, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, ముద్దనూరు, తాడిపత్రి, గుత్తి, గుంతకల్, మంత్రాలయం రోడ్, రాయ్‌చూర్, యాద్గిర్, చిత్తాపూర్, తాండూర్, వికారాబాద్, లింగంపల్లి, సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ధర్మాబాద్, నాందేడ్, పూర్ణ , పర్బణి, జాల్నా, ఔరంగాబాద్స్టేషన్లలో ఆగుతాయని అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు ఈ స్పెషల్ ట్రైన్ల సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇండిపెండెన్స్ డే సందర్భంగాను..
స్వాతంత్ర్య దినోవాన్ని పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే ఈ నెల 13 నుంచి 16 వరకు వివిధ మార్గాల్లో స్పెషల్రైళ్లు నడుపుతుంది. కాచిగూడ–-తిరుపతి–-కాచిగూడ, మచిలీపట్నం-–వికారాబాద్–-మచిలీపట్నం, హైదరాబాద్–-సంత్రాగచ్చి–-హైదరాబాద్, నర్సాపూర్–-నాగర్సోల్– -నర్సాపూర్, నర్సాపూర్–-సికింద్రాబాద్–-నర్సాపూర్స్టేషన్ల మధ్య ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని, ఈ మార్గాల్లో ప్రయాణించే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.