- డిసెంబర్ 4 నుంచి జనవరి 30 వరకు అందుబాటులో రైళ్లు
- దక్షిణ మధ్య రైల్వే అధికారుల వెల్లడి
సికింద్రాబాద్, వెలుగు: పండుగల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం కాజీపేట– -దాదర్స్టేషన్ల మధ్య 34 స్పెషల్ఎక్స్ప్రెస్రైళ్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం తెలిపింది. డిసెంబర్ 4 నుంచి వచ్చే ఏడాది జనవరి 30వ తేదీ వరకు నడుస్తాయని పేర్కొంది. కాజీపేట – -దాదర్ ( ప్రతి బుధ, శనివారం) దాదర్– -కాజీపేట ( ప్రతి గురు, ఆదివారం) నడపనున్నట్టు వెల్లడించింది.
స్పెషల్ రైళ్లు జమ్మికుంట, పెద్దపల్లి, కరీంనగర్, లింగంపేట్, జగిత్యాల, మెట్పల్లి, ఆర్మూర్, నిజామాబాద్, బాసర, ధర్మాబాద్, ఉమ్రి, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ, పర్బణి, సేలు, పర్టూర్, ఔరంగబాద్, లాసూర్, రోటేగావ్, నాగర్సోల్, మన్మాడ్, నాసిక్, ఇగట్పురి, కళ్యాణి రైల్వే స్టేషన్లలో ఆగుతాయని అధికారులు రైల్వే తెలిపారు.
ధనాపూర్- బెంగళూరు మధ్య స్పెషల్ట్రైన్ సర్వీసుల పొడిగింపు
పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ని ధనాపూర్-ఎస్ఎంవీటీ – బెంగళూర్ రూట్ లో నడిచే పలు స్పెషల్ ట్రైన్ సర్వీసులను మరో రెండు నెలలు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 13 నుంచి డిసెంబరు 30 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. 10 స్పెషల్ ట్రైన్స్140 సార్లు ప్రయాణికులను చేరవేస్తాయని తెలిపారు.
నిజామాబాద్: అయోధ్య రైలు కోసం తొమ్మిది నెలల కింద రద్దైన కాజీపేట- – దాదర్ ట్రైన్ పునరుద్ధరివంచినట్టు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి తెలిపారు. జిల్లా ప్రజల డిమాండ్మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లి ఒప్పించానని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతానికి జనవరి నెలాఖ రు దాకా రైలు సేవలు అందించాలని మంత్రి నిర్ణయించారని దీనిని పర్మినెంట్ చేస్తాయిస్తానన్నారు.