
- దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్రిలేషన్స్ ఆఫీసర్ శ్రీధర్
హైదరాబాద్ సిటీ, వెలుగు: హోలీ పండుగ పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు ప్రకటించింది. ఈ రైళ్లు ఈ నెల 9 నుంచి 25 వరకు వివిధ రూట్లలో ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని ఎస్సీఆర్ చీఫ్పబ్లిక్ రిలేషన్స్ఆఫీసర్ శ్రీధర్ తెలిపారు. ఈ నెల 9 నుంచి16 వరకు చర్లపల్లి–షాలిమార్, షాలిమార్ నుంచి చర్లపల్లికి 4 రైళ్లు నడుపనున్నట్టు చెప్పారు. చర్లపల్లి – సంత్రాగచి మధ్య 4 సర్వీసులు నడుపనున్నట్లు పేర్కొన్నారు.
ఇవి నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, కొత్త వలస, విజయనగరం, శ్రీకాకుళం, పలాస, బెర్హంపూర్, కుర్ధా, భువనేశ్వర్, భద్రక్, జలేశ్వర్, ఖరగ్ పూర్స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయని వివరించారు.