
చర్లపల్లి టర్మినల్ నుండి ధనాపూర్ కి ప్రత్యేక రైళ్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. కుంభమేళాకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు తెలిపారు రైల్వే అధికారులు. విజయవాడ, భువనేశ్వర్, అసన్సోల్, పాట్నా మీదుగా చర్లపల్లి, దానాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించారు అధికారులు. మహా కుంభమేళా జరిగే ప్రయాగ్ రాజ్ కు వెళ్లే వారికి దానాపూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఉపయోగపడనున్నాయి.
Also Read :- అసెంబ్లీలో భారత క్రికెటర్ షమీపై రచ్చ
ఆపరేషనల్ ఇష్యూస్ కారణంగా ఈనెల 19, 21 తేదీల్లో సికింద్రాబాద్ టు దానాపూర్ దానాపూర్, టు సికింద్రాబాద్ రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు.దీంతో ముందస్తు బుకింగ్ చేసుకొని ప్రయాణికులకు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక రైళ్లను ధనాపూర్ కి నడిపిస్తున్నట్లు ప్రకటించారు అధికారులు. ఫిబ్రవరి 20 నుండి 28 వరకు చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుండి ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.