సంక్రాంతికి ఊరెళ్లినోళ్ల కోసం 8 ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్​ సిటీ, వెలుగు: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లినవారి కోసం దక్షిణ మధ్య రైల్వే అధికారులు చర్లపల్లికి 8 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. శనివారం నుంచి సోమవారం వరకు మూడ్రోజులు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఏపీలోని కాకినాడ, నర్సాపూర్​, విశాఖపట్నంతో పాటు చర్లపల్లి నుంచి విశాఖపట్నం, చర్లపల్లి భువనేశ్వర్​కు రైళ్లు రాకపోకలు సాగిస్తాయని చెప్పారు.

శనివారం మధ్యాహ్నం 3.45కు కాకినాడ నుంచి చర్లపల్లికి మొదటి రైలు బయలుదేరుతుందని, ఆదివారం రాత్రి 9 గంటలకు నర్సాపూర్ ​నుంచి చర్లపల్లికి, శనివారం సాయంత్రం 6.20కు విశాఖ నుంచి చర్లపల్లికి, ఆదివారం ఉదయం 10 గంటలకు చర్లపల్లి నుంచి విశాఖకు, ఆదివారం సాయంత్రం 6.20 కు విశాఖ  నుంచి చర్లపల్లికి, సోమవారం ఉదయం10 గంటలకు చర్లపల్లి నుంచి విశాఖకు, శనివారం సాయంత్రం 7.45కు విశాఖ నుంచి చర్లపల్లికి, ఆదివారం ఉదయం 9కు చర్లపల్లి నుంచి భువనేశ్వర్​కు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు అధికారులు తెలిపారు.