కుందనపల్లి వద్ద రైల్వే ఫ్లైఓవర్‌‌‌‌‌‌‌‌ బ్రిడ్జి శాంక్షన్‌‌‌‌‌‌‌‌: అనుమాస శ్రీనివాస్​

గోదావరిఖని, వెలుగు:  రామగుండం రైల్వేస్టేషన్‌‌‌‌‌‌‌‌ సమీపంలోని కుందనపల్లి 49వ గేట్‌‌‌‌‌‌‌‌ వద్ద రైల్వే ఫ్లైఓవర్‌‌‌‌‌‌‌‌ బ్రిడ్జి నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు గ్రీన్‌‌‌‌సిగ్నల్​ఇచ్చారు. రాజీవ్‌‌‌‌‌‌‌‌ రహదారి నుంచి కుందనపల్లి మీదుగా రామగుండం రైల్వేస్టేషన్‌‌‌‌‌‌‌‌ చేరుకోవాలంటే జనం ఇబ్బందులు పడేవారు. ఈ క్రమంలో రామగుండంకు చెందిన వివేక్‌‌‌‌‌‌‌‌ అనుచరుడు అనుమాస శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ (జీన్స్‌‌‌‌‌‌‌‌) ప్రజల ఇబ్బందులను డీఆర్‌‌‌‌‌‌‌‌ఎం దృష్టికి తీసుకెళ్లి వినతి పత్రం అందజేశారు. 

ఇదే విషయాన్ని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన.. ఫ్లై ఓవర్‌‌‌‌‌‌‌‌ బ్రిడ్జి నిర్మాణానికి రైల్వే అధికారులతో మాట్లాడారు. బ్రిడ్జి నిర్మాణానికి శాంక్షన్‌‌‌‌‌‌‌‌ ఇస్తూ రైల్వే అధికారులు నిర్ణయించగా.. సీనియర్‌‌‌‌‌‌‌‌ డివిజనల్‌‌‌‌‌‌‌‌ ఇంజనీర్‌‌‌‌‌‌‌‌ (కో ఆర్డినేషన్‌‌‌‌‌‌‌‌) కృష్ణారెడ్డి మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు. శాంక్షన్‌‌‌‌‌‌‌‌ లెటర్‌‌‌‌‌‌‌‌ను శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌కు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో అందజేశారు.