తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో రైళ్ల పట్టాల మీద నీళ్లు నిలవడంతో సెప్టెంబర్ 1, 2న ఏపీ మీదుగా వేళ్లే పలు రైళ్లను తాత్కాలికంగా క్యాన్సిల్ చేస్టున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 17 రైళ్లు డైవర్షన్ ..21 రైళ్లు రద్దు చేస్తున్నట్లు తెలిపింది.
17 రైళ్లు దారి మళ్లింపు
హౌరా, విశాఖపట్నం, భువనేశ్వర్, చెన్నై సెంట్రల్ , సికింద్రాబాద్, కన్యాకుమారి, బెంగళూరు, కాకినాడ, తిరుపతి వంటి ప్రధాన నగరాల నుంచి.. బెంగళూరు,విజయవాడ, తిరుపతి, గోవా చెన్నై ,సికింద్రాబాద్, కాకినాడ , తిరుపతి , షాలిమార్ , సంత్రగచి, నిజాముద్దీన్ కు వెళ్లవలసిన పలు రైళ్లను దారి మళ్లించారు. నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ, కడప, సికింద్రాబాద్, గుంతకల్, రేణిగుంట నుంచి పలు రైళ్లను దారి మళ్ళిస్తున్నట్టు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే
21 రైళ్లు రద్దు..
- మచిలీపట్నం-విశాఖపట్నం
- విశాఖపట్నం- మచిలీపట్నం
- అన్నవరం - మచిలీపట్నం
- మచిలీపట్నం -ధర్మవరం
- లింగంపల్లి - నర్సాపూర్
- నర్సాపూర్ - లింగంపల్లి
- ఏలూరు - కాకినాడ
- కాకినాడ - బెంగళూరు
- విజయవాడ- గుంటూరు
- గుంటూరు- మాచర్ల
- కాచిగూడ - మిర్యాలగూడ
- మిర్యాలగూడ - నడికుడే
- నడిగూడ - మిర్యాలగూడ
3 రైళ్లు పాక్షిక రద్దు
- విశాఖపట్నం - విజయవాడ
- విశాఖపట్నం- కడప
- కాకినాడ - తిరుపతి