
వికారాబాద్, వెలుగు: వికారాబాద్, తాండూర్ రైల్వే స్టేషన్లను సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అనిల్ కుమార్ జైన్ మంగళవారం సందర్శించారు. అమృత్ భారత్ ద్వారా రైల్వే స్టేషన్లలో ఆధునీకరణ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఎం భర్తేశ్‌కుమార్, సీనియర్ డీఎస్సీ డెటాస్మిత్ ఛటర్జీ, సీనియర్ డీఎస్టీఈ సుప్రియ, పీసీఓఎం పద్మజ, వికారాబాద్ రైల్వే స్టేషన్ మాస్టర్ దేవేందర్, ఆర్పీఎఫ్ సీఐ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్యూబీ కోసం వినతి..
చేవెళ్ల నియోజకవర్గంలోని చిట్టిగడ్డ చించల్‌పేట మధ్య , గొల్లగూడ వద్ద, ముబారక్పూర్ పర్వేద స్టేషన్ల మధ్య ఆర్యూబీ నిర్మించాలని రైల్వే జీఎం అనిల్ కుమార్ జైన్ కు ఎమ్మెల్యే కాలె యాదయ్య వినతిపత్రం ఇచ్చారు. చిట్టిగడ్డ రైల్వే స్టేషన్లో అనిన ప్యాసింజర్ రైళ్లు, ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లను ఆపాలని కోరారు. వికారాబాద్ జిల్లా కేంద్రమైనందున వికారాబాద్ రైల్వే స్టేషన్లో రాజ్‌కోట్, కోణార్క్ రైళ్లను ఆపాలని వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కె.మాధవరెడ్డి రైల్వే జీఎం అనిల్‌కుమార్ జైన్‌ను కోరారు.