
సికింద్రాబాద్, వెలుగు: సాంకేతిక కారణాల వల్ల వివిధ మార్గాల్లో నడుస్తున్న 29 రైలు సర్వీసులను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ నెల 9,10,11 తేదీల్లో ఈ రైలు సర్వీసులు అందుబాటులో ఉండవని తెలిపారు. విజయవాడ–-బిట్రుగుంట, రాజమండ్రి-–విజయవాడ, విజయవాడ-–మచిలీపట్నం, మచిలీపట్నం–-గుడివాడ, విజయవాడ–-ఒంగోలు, విజయవాడ–-మచిలీపట్నం, విజయవాడ–-భీమవరంటౌన్, భీమవరంటౌన్–-నిడదవోలు, భీమవరంటౌన్–నర్సాపూర్, నర్సాపూర్–-విజయవాడ, గుంతకల్లు–-రాయ్‌చూర్, విజయవాడ-–రాజమండ్రి మార్గంలో నడిచే రైళ్లు రద్దు అయ్యాయని, ప్రయాణికులుప్రత్యామ్నాయం చూసుకోవాలని అధికారులు సూచించారు.