కాగ జ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్-–ఖాజీపేట మధ్య జరుగుతున్న మూడో రైల్వే ట్రాక్ నిర్మాణ పనుల కారణంగా పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. కాగజ్ నగర్ మీదుగా ఢిల్లీ, నాగ్ పూర్, హైదరాబాద్, వరంగల్, ఖాజీపేట వైపు నడిచే పలు రైళ్లను రద్దు చేస్తూ ఆదేశాలు వచ్చాయని కాగజ్ నగర్ రైల్వే చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ కైలాశ్ తెలిపారు. ఈనెల 5 నుంచి 11వరకు కాగజ్ నగర్ ఎక్స్ ప్రెస్, ఇంటర్సిటీ ఎక్స్ ప్రెస్ రైళ్లు రద్దయ్యాయని, అలాగే భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ కాగజ్ నగర్ నుంచి కాకుండా కేవలం సికింద్రాబాద్–-ఖాజీ పేట మధ్య మాత్రమే నడుస్తుందని పేర్కొన్నారు.
ఈనెల 12 నుంచి 28 వరకు కూడా చెన్నై, ఢిల్లీ వైపు ప్రయాణించే పలు సూపర్‌ఫాస్ట్ రైళ్లు రద్దు కాగా, మరికొన్నింటిని దారి మళ్లించినట్లు ఆయన పేర్కొన్నారు. సిర్పూర్-–కరీంనగర్ పుష్పుల్, ఖాజీపే ట-–సిర్పూర్(రామగిరి), కాగజ్‌నగర్–-సికింద్రాబాద్ (కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్), కోర్బా-–కోచివెల్లి, యశ్వంతాపూర్–-జబల్పూర్, గోరఖ్‌పూర్-– యశ్వంతాపూర్, లక్నో-–చెన్నై(లక్నో ఎక్సెప్రెస్), మాతా వైష్ణోదేవి-– చెన్నై ఎక్స్‌ప్రెస్, కాజీపేట–-పుణె, కన్యాకుమారి-–బనారస్, సికింద్రాబాద్-–రక్సోల్, హైదరాబాద్–-రక్సోల్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ఈ నెల 28వరకు పూర్తిగా రద్దుచేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు.
Also Read : కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ
అదేవిధంగా గోరఖ్‌పూర్–-యశ్వంతాపూర్, గోరఖ్‌పూర్–-సికింద్రాబాద్,న్యూఢిల్లీ–-హైదరాబాద్, సికింద్రాబాద్-–ధన్పూర్, అహ్మదాబాద్-–చెన్నై, న్యూఢిల్లీ-–చెన్నై, రక్సోల్-–హైదరాబాద్ రైళ్లను దారి మళ్లించినట్లు పేర్కొన్నారు. ప్రయాణీకులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచించారు. గత డిసెంబరు 19 నుంచి జనవరి13 వరకు కూడా రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రైన్ల రద్దుతో స్టేషన్ వెలవెలబోతోంది.